ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన హీరో
TOLLYWOOD
 TOPSTORY

ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన హీరో

Murali R | Published:August 11, 2017, 12:00 AM IST
తమిళ స్టార్ హీరో విజయ్ తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు . ఇటీవల ఓ మహిళా జర్నలిస్ట్ షారుఖ్ నటించిన '' జబ్ హ్యారీ మెట్ సజల్ '' సినిమా చూసింది అయితే ఆ సినిమా నచ్చకపోవడంతో విజయ్ గతంలో నటించిన '' సురా '' సినిమాలా చెత్తగా ఉందని పోస్ట్ పెట్టింది ధన్య రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్ట్ . దాంతో మా హీరో సినిమాని అవమానించడమే కాకుండా విజయ్ ని కూడా అవమానిస్తావా ? అంటూ విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ధన్య రాజేంద్రన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు పోస్ట్ చేసారు.

ఆ బూతులు హర్ట్ అయిన ధన్య రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఈ విషయం విజయ్ కి తెలియడంతో స్పందించి తన అభిమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు . ఒక మహిళ తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు గౌరవించాల్సింది పోయి అగౌరవమైన పోస్ట్ లు పెడతారా పైగా నా అభిమానులు అని చెప్పుకొని ...... ఇలాంటి అభిమానులు నాకు అవసరం లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విజయ్.Comments

FOLLOW
 TOLLYWOOD