ప్లేటు ఫిరాయించిన హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

ప్లేటు ఫిరాయించిన హీరోయిన్

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST
మలయాళ స్టార్ హీరో దిలీప్ అమాయకుడు , నేను అతడిపై ఫిర్యాదు చేయలేదు అంటూ ప్లేటు ఫిరాయించింది మలయాళ హీరోయిన్ భావన . ఈ భామ పై మూడు నెలల కిందట అఘాయిత్యం జరిగిన విషయం తెలిసిందే , అయితే అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పుడు హీరో దిలీప్ అరెస్ట్ తో మరింత సంచలనం అయ్యింది . దిలీప్ కీలక సూత్రధారి అని పోలీసులు చెబుతుండగా భావన మాత్రం అతడు అమాయకుడు అంటూనే ఒకవేళ అతడు నేరం చేసినట్లు రుజువైతే తప్పక శిక్షించాల్సిందే అని స్టేట్మెంట్ ఇచ్చింది .
 
 

భావన పత్రికా ప్రకటన రిలీజ్ చేయడంతో అందరూ ఖంగు తిన్నారు . పోలీసులు రకరకాలుగా దర్యాప్తు చేసి ఆధారాలతో అరెస్ట్ చేస్తే ఈ హీరోయిన్ మాత్రం అతడు అమాయకుడు అని ఎలా స్టేట్మెంట్ ఇస్తుందని షాక్ అవుతున్నారు . దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తుండగా భావన మాత్రం మరోలా ప్రకటన చేసి కేసు తీవ్రత ని దెబ్బ కొట్టింది .
Comments

FOLLOW
 TOLLYWOOD