రెండున్నర కోట్ల ఇన్సూరెన్స్ కొట్టేసిన నాగార్జున
TOLLYWOOD
 TOPSTORY

రెండున్నర కోట్ల ఇన్సూరెన్స్ కొట్టేసిన నాగార్జున

Murali R | Published:November 20, 2017, 10:34 AM IST
ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో మనం సెట్ కాలిపోయిన విషయం తెలిసిందే. దాంతో రెండు కోట్ల నష్టం జరిగిందని నాగార్జున వాపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు మనం సెట్ కాలినందుకు రెండున్నర కోట్ల ఇన్సూరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మనం షూటింగ్ సమయంలో సెట్ కి ఇన్సూరెన్స్ చేయించాడు నాగార్జున దాంతో ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చింది. అక్కినేని మనం చివరి చిత్రం కావడంతో ఎంతో అపురూపంగా మనం సెట్ ని చూసుకుంటున్నాడు నాగార్జున.

కానీ చిన్న పొరపాటు వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ నాగార్జున కు కలిసి వచ్చింది. నాగ్ నిజంగానే మంచి బిజినెస్ మెన్ కావడంతో లక్కులో పడ్డాడు. మనం చిత్రానికి పెద్దగా అవార్డులు రాకపోయినా రెండున్నర కోట్ల ఇన్సూరెన్స్ వచ్చింది.Comments

FOLLOW
 TOLLYWOOD