ఎన్టీఆర్ చరణ్ ల సినిమాకు బడ్జెట్ ఎంతో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ చరణ్ ల సినిమాకు బడ్జెట్ ఎంతో తెలుసా

Murali R | Published:November 22, 2017, 7:09 PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాంచరణ్ తేజ్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది ఆ చిత్రానికి , రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ని వండుతున్నాడు . ఇక బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొనడం ఖాయం , అలాగే ఎన్టీఆర్ - చరణ్ ల కాంబినేషన్ కాబట్టి అంచనాలు ఆకాశాన్ని చేరుకోవడం ఖాయం అందుకే భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు . 
 
 
ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ........ 150 కోట్లట ! అవును ఎన్టీఆర్ - చరణ్ లు కలిసారు కాబట్టి అందునా రాజమౌళి డైరెక్షన్ కాబట్టి 150 కోట్ల బడ్జెట్ తో రూపొందించడానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారట . ఇక ఈ సినిమా ఆలస్యం కాకుండా వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభించి 2019 వేసవిలో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నాడట జక్కన్న . ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం . Comments

FOLLOW
 TOLLYWOOD