అజ్ఞాత వాసి తో రికార్డులు బద్దలు కొడతాడా
TOLLYWOOD
 TOPSTORY

అజ్ఞాత వాసి తో రికార్డులు బద్దలు కొడతాడా

Murali R | Published:December 17, 2017, 3:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం అజ్ఞాత వాసి . కీర్తి సురేష్, అను ఇమాన్యు యేల్ లు పవన్ సరసన నటిస్తుండగా కీలక పాత్రలో ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ కుష్భు నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

 

అయితే రిలీజ్ కి ఇంకా 20 రోజులకు పైగా సమయం ఉంది కాని ఈలోపే పవన్ కళ్యాణ్ రికార్డుల వేట మొదలు పెట్టాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ వంద కోట్ల ని దాటింది . రిలీజ్ నాటికి 150 కోట్ల మైలురాయి దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సినిమా బాగుందని టాక్ వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. పవన్ కున్న ఇమేజ్ కి సినిమా కాస్త బాగుందని టాక్ వస్తే చాలు రికార్డుల మోత మోగుతుంది.
Comments

FOLLOW
 TOLLYWOOD