బాక్స్ లు బద్దలు కొడుతున్న ఎన్టీఆర్
TOLLYWOOD
 TOPSTORY

బాక్స్ లు బద్దలు కొడుతున్న ఎన్టీఆర్

Murali R | Published:September 29, 2017, 3:39 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన జై లవకుశ కు యునానిమస్ గా హిట్ టాక్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల లో ఎన్టీఆర్ వీర విహారం చేస్తున్నాడు . ఎన్టీఆర్నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయి బ్రహ్మరథం పడుతున్నారు.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం , రాశిఖన్నా , తమన్నా గ్లామర్ వెరసి జై లవకుశ భారీ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధించేలా ఉంది. దసరా పండగ సెలవులు కూడా తోడు కావడంతో భారీ కలెక్షన్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ జోరు మరో పది రోజుల పాటు కొనసాగేలా ఉంది ఎందుకంటే అక్టోబర్ 4 వరకు దసరా సెలవులు మరి. Comments

FOLLOW
 TOLLYWOOD