కలెక్షన్లతో దుమ్మురేపుతున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

కలెక్షన్లతో దుమ్మురేపుతున్నాడు

Murali R | Published:October 19, 2017, 8:08 PM IST
తమిళ స్టార్ హీరో విజయ్ కి తమిళనాట తిరుగులేని ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే . విజయ్ నటించిన మెర్సల్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది . భారీ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కావడంతో పాటు విజయ్ స్టార్ డం కూడా తోడవడంతో భారీ కలెక్షన్ల ని కొల్లగొట్టింది . నిన్న ఎన్ని కోట్ల ని కొల్లగొట్టాడో తెలుసా ....... ఒక్కరోజు లోనే 31 కోట్ల కు పైగా వసూల్ చేసాడు విజయ్ . తమిళనాట మాత్రమే కాక వరల్డ్ వైడ్ గా విజయ్ కి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు . దాంతో ఈ సినిమాని అమెరికాతో పాటుగా మలేషియా , యూకే , ఆస్ట్రేలియా లలో కూడా రిలీజ్ అయ్యింది మెర్సల్ చిత్రం . 
 
 
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ని విపరీతంగా అలరిస్తోంది . సినిమాకు హిట్ టాక్ రావడం తో భారీ వసూళ్ల ని సాధిస్తున్నాడు విజయ్ . టాక్ కి తగ్గట్లుగా దీపావళి సెలవులు కూడా తోడవుతున్నాయి దాంతో విజయ్ కెరీర్ లో మరో భారీ హిట్ లభించినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . విజయ్ సరసన సమంత , కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ లు నటించిన మెర్సల్ తెలుగులో అదిరింది గా రిలీజ్ కానుంది . Comments

FOLLOW
 TOLLYWOOD