మహేష్ చిత్రానికి భారీ డిమాండ్
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ చిత్రానికి భారీ డిమాండ్

Murali R | Published:April 13, 2017, 12:00 AM IST
మహేష్ తాజాగా నటిస్తున్న స్పైడర్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడానికి పలువురు బయ్యర్లు పోటీ పడుతుండగా అదే విధంగా చానళ్ళు సైతం పోటీ పడుతున్నాయి ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడానికి . రెండు భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 26 కోట్లకు ఓ టాప్ చానల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది . రెండు భాషలలో కలిపి ఈ భారీ మొత్తాన్ని ముట్ట జెప్పడానికి ఆ చానల్ సిద్దపదిందట . నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి , టైటిల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది . 
 
 

ఇక ఏరియాల బిజినెస్ కు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . పైగా మహేష్ లుక్ వచ్చిన తర్వాత ఈ డిమాండ్ మరీ ఎక్కువయ్యింది . దాంతో పలువురు బయ్యర్లు స్పైడర్ ని సొంతం చేసుకోవడానికి భారీ మొత్తాన్ని చెల్లించడానికి ముందుకు వస్తున్నారు . ఈ సినిమా జూన్ 23న రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD