రిలీజ్ కి ముందే లాభాలు తెచ్చిన రవితేజ
TOLLYWOOD
 TOPSTORY

రిలీజ్ కి ముందే లాభాలు తెచ్చిన రవితేజ

Murali R | Published:September 29, 2017, 4:56 AM IST
మాస్ మహారాజ్ రవితేజ కొంత గ్యాప్  తర్వాత చేస్తున్న సినిమా '' రాజా ది గ్రేట్ ''. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ కాగా రాశి ఖన్నా ఐటెం సాంగ్ చేసింది ఈ చిత్రంలో . ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది , టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి . దాంతో బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడింది రాజా ది గ్రేట్ చిత్రానికి . శాటిలైట్ రూపంలో , అలాగే డిజిటల్ , హిందీ  రైట్స్ రూపంలో ఈ సినిమా ఎంత దక్కించుకుందో తెలుసా ...... 18 కోట్లు .

శాటిలైట్ , డిజిటల్ , హిందీ  రైట్స్ కి ఇంతటి భారీ సొమ్ము రావడంతో ఆ సినిమా నిర్మాత దిల్ రాజు చాలా సంతోషంగా ఉన్నాడు . ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల హక్కులు కూడా ఉన్నాయి దాంతో మొత్తం మీద మరో 15 -20 కోట్లు అవలీలగా వచ్చేలా ఉన్నాయి అంటే రిలీజ్ కి ముందే రవితేజ సినిమా లాభాలు తెస్తున్నాడు దిల్ రాజుకు . టేబుల్ ప్రాఫిట్ జాబితాలో రాజా ది గ్రేట్ చిత్రం చేరిపోయింది . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 12న రిలీజ్ కానుంది . Comments

FOLLOW
 TOLLYWOOD