ఆ నిర్మాతకు భారీ నష్టాలు
TOLLYWOOD
 TOPSTORY

ఆ నిర్మాతకు భారీ నష్టాలు

Murali R | Published:October 5, 2017, 7:35 PM IST
అగ్ర నిర్మాత దిల్ రాజు కు స్పైడర్ చిత్రం భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది . దాదాపుగా స్పైడర్ సినిమా రిలీజ్ అయి వారం కావస్తోంది , కానీ తెలంగాణ లో  వసూల్ అయ్యింది కేవలం 12 కోట్లు మాత్రమే ! కానీ ఈ సినిమాని పొతే పడి మరీ 25 కోట్లకు కొన్నాడు దిల్ రాజు . రేపు పెద్ద సినిమాలు ఏవి కూడా రిలీజ్ కావడం లేదు కాబట్టి స్పైడర్ ని మరో వారం రోజులు పొడిగించవచ్చు దాంతో మరో నాలుగైదు కోట్లు వస్తే ఎక్కువ ! 

 

అంటే ఎంత లేదన్నా పది కోట్లకు పైగా నష్టం వస్తోంది దిల్ రాజు కు . నైజాం లో కొన్ని థియేటర్ లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి కాబట్టి వాటి లెక్కలు పక్కన పెట్టినా కూడా స్పైడర్ దిల్ రాజు ని ముంచినట్లే ! ఇక ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రాన్ని కూడా దిల్ రాజే కొన్నాడు నైజాం లో . అయితే ఆ సినిమా వల్ల నష్టాలు లేవు కానీ పెద్దగా లాభాలు రాలేదు . దాంతో జై లవకుశ విషయంలో ఒడ్డున పడినట్లే కాకపోతే స్పైడర్ తోనే దిల్ రాజు కు ఇబ్బందులు . 
Comments

FOLLOW
 TOLLYWOOD