రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి
TOLLYWOOD
 TOPSTORY

రికార్డులు బద్దలు కొడుతున్న చిరంజీవి

Murali R | Published:January 13, 2017, 12:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఈరోజు రిలీజ్ అయి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. భారీ ఓపెనింగ్స్ రావడంతో మెగా శిబిరం చాలా సంతోషంగా ఉంది. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ సంతోషానికి అవదులే లేకుండా పోయాయి.

 

 

చిరంజీవి చాలాకాలం తర్వాత నటించిన చిత్రం కావడం , తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం కావడంతో మొదటి నుండి ఈ చిత్రం పై భారీ  అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా భారీ ఓపెనింగ్స్ సాధించడం తో మొదటి రోజు , మొదటి వారం రికార్డులు బద్దలు కావడం ఖాయమని ధీమాగా ఉన్నారు మెగా శిబిరం . 
Comments

FOLLOW
 TOLLYWOOD