ఓవర్సీస్ లో సంచలనం సృష్టిస్తున్న చిరు
TOLLYWOOD
 TOPSTORY

ఓవర్సీస్ లో సంచలనం సృష్టిస్తున్న చిరు

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST
దాదాపు 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం కావడంతో ఖైదీ నెంబర్ 150 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఓవర్ సీస్ లో అయితే అప్పుడే చిరు మేనియా తో దద్దరిల్లి పోతోంది . ప్రీమియర్ షోలకు బీభత్సంగా కలెక్షన్లు వస్తున్నాయి . కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్లను వసూల్ చేసేలా ఉంది ఖైదీ నెంబర్ 150 చిత్రం . ఇక మెగా ఫ్యాన్స్ అయితే ఓవర్ సీస్ లో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు . బాస్ సినిమా చాలాకాలం తర్వాత రిలీజ్ అవుతోంది అన్న ఉత్సాహంలో ఉన్నారు .

యు ఎస్ , యూకే , యు ఏ ఈ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల కనక వర్షం కురుస్తోంది . ఇంకా పండగ మూడు రోజులు ఉండగానే వసూళ్లు ఈ రేంజ్ లో ఉంటే వారం రోజుల తర్వాత లెక్కలు కడితే బాక్స్ లు బద్దలు కావలసిందే అన్న జోష్ లో ఉన్నారు మెగా ఫ్యాన్స్ . మొత్తానికి చిరు రీ ఎంట్రీ పెద్ద సంచలనమే సృష్టిస్తోంది .Comments

FOLLOW
 TOLLYWOOD