పవన్ కళ్యాణ్ చిత్రానికి కళ్ళు చెదిరే రేటు
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కళ్యాణ్ చిత్రానికి కళ్ళు చెదిరే రేటు

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన పవర్ చూపించాడు . తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఆ ఇద్దరి కాంబినేషన్ లో జల్సా , అత్తారింటికి దారేది చిత్రాలు వచ్చాయి రెండు కూడా సూపర్ హిట్ కావడంతో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి . దాంతో ఈ సినిమాని సొంతం చేసుకోవడానికి తీవ్రమైన పోటీ ఏర్పడింది . 
 
 
ఇక ఈ చిత్ర నైజాం హక్కుల కోసం పోటీ తీవ్రంగా జరుగగా అగ్ర నిర్మాత దిల్ రాజు 29 కోట్లకు సొంతం చేసుకున్నాడు . ఇంత పెద్ద రేటు పలకడంతో సంచలనం అయ్యింది . నాన్ బాహుబలి చిత్రాల్లో పవన్ చిత్రానిదే పెద్ద రేటు , భారీ రేటు పలకడంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . ఇదే రీతిలో మిగతా ఏరియాల అమ్మకాలు కూడా జరగడం ఖాయం . దాంతో రిలీజ్ కి ముందే నిర్మాతకు లాభాల పంట పండటం ఖాయం . ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది  జనవరి 10న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .Comments

FOLLOW
 TOLLYWOOD