ఎన్టీఆర్ బిగ్ బాస్ కి అదిరిపోయే రేటింగ్
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ బిగ్ బాస్ కి అదిరిపోయే రేటింగ్

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షోకి అదిరి పోయే రేటింగ్ వచ్చింది . నిన్న రాత్రి ప్రసారమైన బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ కి అనూహ్యమైన స్పందన రావడానికి కారణం ఏంటో తెలుసా ....... .... యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి కారణం అయితే రెండోది తెలుగు వాళ్లకు ఈ షో కొత్త రకమైనది కావడం . ఎన్టీఆర్ కోసం అతడి అభిమానులు మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రజలంతా ఎంతో ఈగర్ గా టివి లకు అతుక్కుపోయారు .
 
 

అయితే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన విధానం బాగానే ఉన్నప్పటికీ , అందులో పాల్గొన్న వాళ్ళని చూసేసరికి ఉరకలెత్తిన ఉత్సాహం దెబ్బకి ఆవిరి అయిపొయింది . పార్టిసిపెంట్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కోసం అందరూ టివి లకు అతుక్కు పోవడంతో అదిరిపోయే రేటింగ్ వచ్చింది బిగ్ బాస్ కు . ఇక ఈ బిగ్ బాస్ కు ఆదరణ ముందు ముందు  ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే . 
Comments

FOLLOW
 TOLLYWOOD