ఓవర్ సీస్ లో భారీ ఎత్తున మహేష్ స్పైడర్
TOLLYWOOD
 TOPSTORY

ఓవర్ సీస్ లో భారీ ఎత్తున మహేష్ స్పైడర్

Murali R | Published:September 12, 2017, 12:00 AM IST
మహేష్ బాబు ఓవర్ సీస్ కింగ్ కావడంతో స్పైడర్ చిత్రాన్ని అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మొత్తంగా ఒక్క తెలుగు స్క్రీన్ లే 600 కు పైగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే తమిళుల కోసం మరో 150 స్క్రీన్ లు మొత్తంగా 750 స్క్రీన్ లలో మహేష్ స్పైడర్ రిలీజ్ కానుంది అంటే ఏ ఒక్క తెలుగు సినిమాకు ఇంతటి భారీ రిలీజ్ లేదు అది మహేష్ కు దక్కిన గౌరవం . మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 26 సాయంత్రమే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

26 సాయంత్రం ప్రీమియర్ షోలు స్టార్ట్ అయితే ఇక్కడ 27 మార్నింగ్ నాటికి మనకు ఇంకా రిలీజ్ కాకముందే దాని టాక్ ఏంటో తెలిసిపోనుంది . మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ దర్శకులు ఎస్ జె సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు అలాగే భరత్ అనే తమిళ హీరో కూడా నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు . సెప్టెంబర్ 27న భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయం.Comments

FOLLOW
 TOLLYWOOD