Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

నాగచైతన్య కొత్త సినిమా పేరు ఏంటో తెలుసా

అక్కినేని నాగచైతన్య తాజాగా మైత్రి మూవీస్ సంస్థ లో సినిమా చేయడానికి అంగీకరించాడు . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సరికొత్త టైటిల్ ని ఫిక్స్ చేసారు . ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసా ....... '' సవ్య సాచి '' . మహాభారతంలో అర్జునుడికి ఈ సవ్య సాచి అనే బిరుదు ఉంది . విభిన్న కథా చిత్రాల దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి .   ఈరోజు అధికారికంగా సవ్య సాచి అనే టైటిల్ ని ప్రకటించనున్నారు మైత్రి మూవీస్ అధినేతలు . మహేష్ తో శ్రీమంతుడు , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన మైత్రి మూవీస్ సంస్థ నుండి వస్తున్న చిత్రం కావడంతో సవ్య సాచి పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం . 

జగన్ పై సెటైర్ వేసిన వేణు మాధవ్

నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని కాకపోతే ఎంత మెజారిటీ వస్తుందో తెలుసుకోవడానికే నంద్యాల కు వచ్చానని జగన్ పై సెటైర్ వేసాడు హాస్య నటుడు వేణు మాధవ్ . తెలుగుదేశం పార్టీ కోసం మొదటి నుండి కష్టపడుతున్న వేణు మాధవ్ తాజాగా ఉప ఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్ళాడు . తెలుగుదేశం పార్టీ ని గెలిపించేది జగన్ అని బాంబ్ పేల్చాడు .     ప్రతీ రోజు చంద్రబాబు నాయుడు ని జగన్ అదే పనిగా విమర్శిస్తూ మా విజయాన్ని ఖాయం చేసాడని ఇక ఇప్పుడు మిగిలి ఉంది కేవలం ఎంత మెజారిటీ అనేది మాత్రమే నని జగన్ పై సెటైర్ వేసాడు వేణు మాధవ్ . నంద్యాల లో తెలుగుదేశం - వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లు హోరా హోరీ గా తలపడుతున్న విషయం తెలిసిందే . మరి ఈ పోటీలో గెలిచేది ఎవరో . 

నటి పై అత్యాచారయత్నం

ఓ యువ నటి పై అత్యాచారయత్నం జరిగింది , అయితే ఆ ప్రమాదం నుండి త్రుటి లో తప్పించుకుంది కానీ మరో యాక్సిడెంట్ కు గురవవడంతో స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది . సంఘటన పూర్వాపరాలలోకి వెళితే ........ ఓ యువ నటి ని తమ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు చలపతి అనే దర్శకుడు అలాగే సుజన్ అనే హీరో . లొకేషన్ నిమిత్తం అంటూ హైదరాబాద్ నుండి భీమవరం కారులో ప్రయాణం చేస్తున్నారు .     సదరు హీరోయిన్ ముందు కూర్చోగా దర్శకులు  వెనక సీట్లో కూర్చున్నారు అయితే సడెన్ గా హీరోయిన్ మీద చేతులు వేస్తూ లొంగ దీసుకోవడానికి ప్రయత్నాలు చేయడంతో పెనుగులాట మొదలయ్యింది ఈలోపు కారు అదుపుతప్పి ఓ లారీ ని డీ కొట్టడంతో హీరోయిన్ కు స్వల్ప గాయాలయ్యాయి . దాంతో ఆమెని విజయవాడ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు . ఇంకేముంది ఈ విషయం పోలీసులకు తెలియడం తో దర్శకులు చలపతి ని అరెస్ట్ చేసారు , హీరో పరారీ లో ఉన్నాడు . ఇక హీరోయిన్ ఎవరన్నది గోప్యాంగా ఉంచుతున్నారు పోలీసులు . 

పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడా

ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నిక జరుగుతోంది , అక్కడ ప్రచారం హోరెత్తి పోతోంది . అధికార , ప్రతిపక్ష పార్టీ లు కొదమ సింహాల్లా తలపడుతున్నాయి . తీవ్ర స్థాయిలో ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు . నామినేషన్ల సమయంలో మాత్రం రెండు రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు కానీ ఇంతవరకు దాని అతీగతీ లేదు .     ఒకవైపు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది కానీ పవన్ తన మద్దతు ఎవరికో ఇదమిద్దంగా తెలియజేయడం లేదు . తెలుగుదేశం పార్టీ కి గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చాడు పవన్ మరి ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇస్తాడా ? లేక జగన్ పార్టీ కి ఇస్తాడా ? తెలియడం లేదు లేదంటే ఏ పార్టీ కి మద్దతు ఇవ్వకుండా తటస్థం గా ఉంటాడా చూడాలి .

ఇంకా జైల్లోనే మగ్గుతున్న హీరో

మలయాళ స్టార్ హీరో దిలీప్  అరెస్ట్ అయి రెండు నెలలు కావస్తోంది  , అప్పటి నుండి బెయిల్ రాకుండా జైలు లోనే మగ్గుతున్నాడు . బెయిల్ కోసం ఇప్పటికే రెండుసార్లు కోర్టు మెట్లు ఎక్కగా అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కోర్టు తాజాగా మరోసారి బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు దిలీప్ . ఈనెల 18న బెయిల్ విచారణ జరుగనుంది మరి ఈసారి అయినా కోర్టు కనికరించి దిలీప్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుందో లేదంటే బెయిల్ పిటీషన్ కొట్టేస్తుందో చూడాలి .   మలయాళ హీరోయిన్ ని వేధించిన కేసులో హీరో దిలీప్ ని అరెస్ట్ చేశారు పోలీసులు . అప్పటి నుండి అలువా సబ్ జైలు లోనే ఉంటున్నాడు ఈ హీరో . ఇక తాజాగా ఈ హీరో గారి మదర్ కూడా నా కొడుకు నిర్దోషి అని కేరళ ముఖ్యమంత్రి కి లేఖ రాసింది . మోహన్ లాల్ , మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్ ల తర్వాత అంతటి స్టార్ డం పొందిన దిలీప్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతన్నాడు .

శృతి హాసన్ కిడ్నాప్ కు కుట్ర

శృతి హాసన్ తో పాటు అక్షర హాసన్ లను కిడ్నాప్ చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర చేశారట ! అయితే కిడ్నాప్ కి ముందే ఈ విషయాన్నీ కమల్ పసిగట్టడంతో భారీ ప్రమాదం తప్పిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు కమల్ హాసన్ . శృతి , అక్షర హాసన్ లను కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళు కమల్ కు తెలుసట అటువంటి వాళ్ళని చంపేయాలని అనుకున్నాడట కానీ మానవతా దృక్పథం తో వదిలేసాడట.అయితే వాళ్ళని కిడ్నాప్ చేయాలనుకుంది ఇప్పుడు కాదట ! శృతి , అక్షర హాసన్ లు చిన్న పిల్లలు గా ఉన్న సమయంలో కమల్ ఇంట్లో పనిచేసే వాళ్లతో పాటు కొంతమంది బయటి వాళ్ళు కుట్ర చేశారట . ఆ సమయంలో కమల్ తీవ్రంగా మదనపడ్డారట . అలా మధనంలోంచి వచ్చిన కథే '' మహానది ''. ఈ విషయాన్నీ తనకు నచ్చిన 70 సినిమాలు అన్న శీర్షిక కోసం వెలువరించాడు.

రామ్ వదిలేసిన సినిమానా అది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ వంటి సంచలన చిత్రాన్ని అందించిన కరుణాకరన్ ఆ తర్వాత రేసులో వెనుకబడిపోయాడు . ఆ స్థాయి విజయాన్ని అందించలేక పోతున్నాడు . అయితే తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ప్రేమ కథా చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు . రేపు ఈ సినిమా ప్రారంభం కాబోతోంది , కానీ ఈ సినిమాలో అసలు హీరో రామ్ నటించాల్సి ఉంది అని వినబడుతోంది.నేను శైలజ వంటి సూపర్ హిట్ తర్వాత కరుణాకరన్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు రామ్ . కథ కూడా చెప్పాడట , మొదట ఓకే అని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఎందుకో రామ్ ఆ సినిమా చేయడానికి నిరాకరించాడు దాంతో అదే కథని స్వల్ప మార్పులు చేసి సాయి ధరమ్ తేజ్ కు చెప్పాడట ఇంకేముంది నో చెప్పకుండా ఓకే చేసాడు మెగా మేనల్లుడు .....  ఎందుకంటే పవన్ మామయ్య కు తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చింది కరుణాకర్ కాబట్టి.

40 కోట్ల సినిమా కానీ వచ్చింది 9 కోట్లే

జయ జానకి నాయక సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి 40 కోట్ల కు పైగా ఖర్చు పెట్టి నిర్మించాడు . అయితే ఈనెల 11న రిలీజ్ అయిన జయ జానకి నాయక తొలి వీకెండ్ లో కేవలం 9 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది అది కూడా వరల్డ్ వైడ్ షేర్ , అంటే 31 కోట్ల కు పైగా వసూల్ చేయాలి ఈ సినిమా , ఫస్ట్ వీక్ లోనే రాబట్టలేక పోయిందంటే మిగతా రోజులలో అంత భారీ మొత్తాన్ని వసూల్ చేయడం కష్టమే !అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే ...... సాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో 11 కోట్ల పైనే వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ లో సగం వస్తున్నట్లే ! మరి మిగతా సగం మాట ఏంటో ? ఇక ఏరియాల వారీగా చూస్తే ఈ సినిమాని కొనుక్కున్న వాళ్ళు దాదాపుగా నష్టపోతున్నారు . వాళ్లకు మళ్ళీ తదుపరి సినిమాతో సర్దుబాటు చేయాల్సిందే సదరు దర్శక నిర్మాతలు.

హమ్మయ్య ! ప్రభాస్ కు హీరోయిన్ దొరికింది

ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభమై చాలాకాలం అయ్యింది కానీ హీరోయిన్ సెట్ కాకపోవడంతో అనుకున్న రేంజ్ లో షూటింగ్ జరగలేదు కానీ ఇన్నాళ్ళకు హీరోయిన్ కష్టాలు తీరిపోయాయి . బాలీవుడ్ భామ '' శ్రద్దా కపూర్ '' ని ఎట్టకేలకు ఎంపిక చేసారు సాహో చిత్ర బృందం . ఈ విషయాన్నీ తాజాగా దృవీకరించారు . హీరోయిన్ కోసం ఎంతమంది ని వడపోశారో లెక్క కడితే అంతు చిక్కదు ఎందుకంటే ఆ లిస్టు చాలా పెద్దది మరి.బాలీవుడ్ లో పలువురు భామలను హీరోయిన్ గా పరిశీలించినప్పటికీ చాలామంది మొదట్లో అంతగా ఆసక్తి చూపించలేదు అలాగే భారీ రెమ్యునరేషన్ ని కూడా డిమాండ్ చేసారు . అయితే ఎట్టకేలకు శ్రద్దా కపూర్ ని ఎంపిక చేసారు ప్రభాస్ సరసన , హీరోయిన్ ఎంపిక కావడంతో ఇక సాహో శరవేగంగా షూటింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది . తెలుగు , తమిళ , హిందీ బాషలలో సాహో రూపొందుతున్న విషయం తెలిసిందే.

సమంత అంటే ఇప్పటికి పడిచచ్చిపోతున్నాడు

సమంత కు వచ్చే అక్టోబర్ లో పెళ్లి కాబోతోంది అయినప్పటికీ సమంత అంటే పడిచచ్చి పోతున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . ఇప్పటికే ఓసారి సమంత అంటే చాలా చాలా ఇష్టమని చెప్పి సంచలనం సృష్టించిన మెగా మేనల్లుడు తాజాగా మరోసారి సమంత అంటే ఎంత క్రశో చెప్పి షాక్ కి గురి చేసాడు . పలువురు హీరోయిన్ లంటే సాయి ధరమ్ తేజ్ కు ఇష్టమే కానీ సమంత అంటే మాత్రం ప్రాణం , కానీ నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు కదా !అయినప్పటికీ సమంత అంటే పిచ్చి అని అంటున్నాడు ఈ మెగా హీరో . సమంత విషయాన్ని పక్కన పెడితే రెజీనా తో వరుసగా రెండు సినిమాలు చేయడం వల్ల , ఆ రెండు కూడా హిట్ కావడం వల్ల సాయి ధరమ్ తేజ్ కు రెజీనా కు ఏదో ఉందని గుసగుసలు వస్తూనే ఉన్నాయి . అయితే వాటి గురించి మాత్రం లైట్ గా తీసుకున్నాడు ఈ హీరో . స్క్రీన్ పై మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా ఉంటుంది కానీ స్క్రీన్ బయట కాదు అంటూ బాంబ్ పేల్చాడు కూడా.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..