Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

నాని ఎం సి ఏ సెన్సార్ టాక్

నాని - ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం '' ఎం సి ఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి ) . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 21న భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమైంది . నిన్న నే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది , యు / ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి . సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఎం సి ఏ చిత్ర బృందాన్ని అభినందించారట . వరంగల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో నాని మరో హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం .    సెన్సార్ సభ్యుల అభినందనలతో పాటుగా ట్రైలర్ కు విపరీతమైన అప్లాజ్ రావడంతో డ్యామ్ శ్యుర్ హిట్ అని ధీమాగా ఉన్నారు . నాని ,సాయి పల్లవి జంట ప్రేక్షకులకు మంచి కనువిందు అని , అలాగే భూమిక పాత్ర కూడా హైలెట్ గా ఉంటుందని లవ్ ఎంటర్ టైన్మెంట్ కు తోడు యాక్షన్ కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది . మొత్తానికి టాక్ ప్రకారం నాని కి మరో హిట్ దొరికినట్లే . 

ఆ వేడుకకు ఎన్టీఆర్ వస్తాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అజ్ఞాత వాసి ఆడియో వేడుకకు ముఖ్య అతిథి గా పిలుస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి , ఈ వార్తలు రావడానికి కారణం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా వచ్చి క్లాప్ కొట్టడమే ! దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న అజ్ఞాత వాసి చిత్రానికి , ఎన్టీఆర్ తో నిర్మించబోయే చిత్రానికి నిర్మాత రాధాకృష్ణ కావడమే . కామన్ విషయం ఏటంటే ఈ ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలకు దర్శకుడు త్రివిక్రమ్ కావడం .    ఎన్టీఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు అయినప్పటికీ అజ్ఞాత వాసి ఆడియో వేడుకకు ముఖ్య అతిథి గా వస్తాడని ప్రచారం సాగుతోంది . ఒకవేళ ఎన్టీఆర్ కనుక పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో వేడుకకు గెస్ట్ గా హాజరైతే అభిమానుల ఆనందానికి అంతే ఉండదు . ఇద్దరు స్టార్ హీరోలు అందునా మాస్ ని విశేషంగా అలరించే హీరోలు ఒకే వేదిక మీద కనిపిస్తే బ్రహ్మాండమే కదా ! 

భయపడుతున్న నాగార్జున

అక్కినేని నాగార్జున నిన్న మొన్నటి వరకు బాగానే కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ '' హలో '' చిత్రం రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో తెగ టెన్షన్ పడుతున్నాడు . ఎందుకంటే అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది దాంతో కొంత గ్యాప్ తీసుకొని చేసిన సినిమా '' హలో ''. మనం వంటి క్లాసికల్ హిట్ ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో ఈనెల 22న రిలీజ్ అవుతోంది . అయితే దానికి ఒకరోజు ముందుగానే నాని నటించిన '' ఎం సి ఏ '' చిత్రం రిలీజ్ అవుతోంది .    నాని ఇటీవల కాలంలో నటించిన చిత్రాలన్నీ వరుసగా హిట్ అవుతున్నాయి , పైగా ఎం సి ఏ చిత్రాన్ని నిర్మించింది అగ్ర నిర్మాత దిల్ రాజు కావడం ..... సినిమాపై పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో నాగార్జున కు భయం పట్టుకుందట . సినిమాలు బాగుంటే ఒక్కటి కాదు నాలుగు చిత్రాలు కూడా ఒకేసారి రిలీజ్ అయి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి . హలో పైన కూడా నాగ్ చాలా నమ్మకంగా ఉన్నాడు కానీ ఎక్కడో చిన్న భయం ఎందుకంటే అఖిల్ కు తప్పనిసరిగా హిట్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు నాగార్జున అందుకే చిన్న భయం .

ఎం.సి.ఎ సెన్సార్ పూర్తి.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా డిసెంబ‌ర్ 21న గ్రాండ్ రిలీజ్‌

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `ఎం.సి.ఎ`. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై  దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 21న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా... హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో ఈ  ఏడాది `శ‌త‌మానంభ‌వ‌తి`, `నేను లోక‌ల్‌`, `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`, `ఫిదా`, `రాజా ది గ్రేట్` చిత్రాల‌తో వ‌రుస‌గా ఐదు సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను చేశాం. ఇప్పుడు `ఎం.సి.ఎ`తో డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అయ్యాం. ఈ సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ సాధిస్తామ‌నే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. డైరెక్ట‌ర్ వేణు శ్రీరాం  డైరెక్ష‌న్‌లో సినిమా చాలా సూప‌ర్బ్‌గా వ‌చ్చింది. యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా నాని, సాయిప‌ల్ల‌విల‌కు  ఈ సినిమాతో మా బ్యాన‌ర్లో మ‌రో హిట్ రావ‌డం గ్యారంటీ. అలాగే భూమిక ఇందులో వ‌దిన పాత్ర‌లో న‌టించారు. చాలా గ్యాప్ త‌ర్వాత భూమిక తెలుగులో చేస్తున్న సినిమా ఇది.  వ‌దిన‌, మ‌రిది మ‌ధ్య  అనుబంధంపై సినిమా ఉంటుంది. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని, నేప‌థ్య సంగీతాన్ని అందించారు. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైనప్ప‌టి నుండి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్‌గా విడులైన ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ష్యూర్ హిట్ అవుతుంద‌ని అంద‌రూ అంటున్నారు.  ఈ అంచ‌నాల‌కు రీచ్ అయ్యేలా ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సినిమా ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. స‌మీర్‌రెడ్డి విజువ‌ల్స్ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ అవుతుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఎటువంటి క‌ట్స్ లేకుండా యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 21న గ్రాండ్ విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.  నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్ట‌ర్ః రామాంజ‌నేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః స‌మీర్‌రెడ్డి, నిర్మాణంః శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, నిర్మాత‌లుః దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌,  క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీరామ్ వేణు.

పవన్ కళ్యాణ్ ని అవమానిస్తున్న రోజా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇప్పటికే వాడు , వీడు అంటూ తీవ్ర పదజాలం తో విమర్శించినా రోజా తాజాగా మరోసారి పవన్ పై విరుచుకుపడింది . పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే రెండుసార్లు గుండు కొట్టించారని ఇక రాబోయే 2019 ఎన్నికల్లో సైతం మళ్ళీ గుండు కొట్టించడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేసింది . ఇప్పటికే పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు అప్పట్లో గుండు కొట్టించాడని పెద్ద ఎత్తున వార్తలు రాగా అవన్నీ అబద్దమే నని తాజాగా తేల్చారు కానీ రోజా మాత్రం సందు దొరికితే చాలు పవన్ ని విమర్శిస్తూ మీడియా ముందుకు వస్తోంది .        మొన్నామధ్య ఓ ఛానల్ లైవ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తీవ్ర పదజాలం తో దూషించింది , అంతేబదులుగా పవన్ భక్తుడు బండ్ల గణేష్ రోజా ని బండ బూతులు తిట్టాడు . అయితే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రోజా మాత్రం తన విమర్శలు మాత్రం ఆపడం లేదు . ఇలాగె కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రోజా గెలవడం కష్టమే అని అంటున్నారు . 

శివకాశీపురం సాంగ్ లాంచ్ చేసిన తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో హరీష్ వట్టి కూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తున్న చిత్రం       '' శివకాశీపురం ''. స్వర్గీయ స్వర చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నారు . ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న శివకాశీపురం చిత్ర నిర్మాణం పూర్తిచేసుకొని సెన్సార్ కు సిద్ధంగా ఉంది .    ఈ నేపథ్యంలో ఈరోజు మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్ డిసి కార్యాలయంలో మూడవ పాటని తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్ రామ్మోహన్ రావు రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు . ఈ సందర్బంగా ఎఫ్ డిసి చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ '' శివకాశీపురం '' చిత్రాన్ని అత్యధిక శాతం మంచిర్యాల లో చిత్రీకరించామని , అక్కడి ప్రజలు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారని దర్శక నిర్మాతలు చెప్పారు సంతోషం , అక్కడే కాదు తెలంగాణ అంతటా సినిమా వాళ్లకు సహకరించే వాళ్లే ఎక్కువగా ఉంటారు . చక్రవర్తి గారి మనవడు , శ్రీ తనయుడు రాజేష్ ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు ..... సినిమా నిర్మాణం ఎంత బాధ్యతగా చేయాలో అంతకంటే ఎక్కువగా రిలీజ్ ని ప్లాన్ చేసుకోవాలి , సరైన డేట్ లో రిలీజ్ చేయడమే మనముందున్న టాస్క్ అని ...... శివకాశీపురం చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు .    నిర్మాత పులిమామిడి మోహన్ బాబు మాట్లాడుతూ " రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా మా చిత్రం లోని పాట రిలీజ్ కావడం ఆనందంగా ఉంది , ఈ సినిమాని మంచిర్యాలలో చిత్రీకరించాం ఆ సమయంలో రామ్మోహన్ రావు గారి  కుటుంబం మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారని , అలాగే రిలీజ్ కి కూడా రామ్మోహన్ రావు గారి సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు .    దర్శకులు వట్టికూటి హరీష్ మాట్లాడుతూ " సినిమా సెన్సార్ కి సిద్ధంగా ఉంది , త్వరలోనే సెన్సార్ కు పంపించి జనవరి లేదా ఫిబ్రవరి లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని .... పవన్ శేష అందించిన సంగీతం మా  చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని ,మాకు అన్నిరకాల గైడెన్స్ ఇస్తున్న రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు పవన్ శేష , పాటల రచయిత చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు . 

నాని కి అవకాశం ఇప్పించింది ఎవరో తెలుసా

నాని ఇప్పుడంటే హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు కానీ మొదట్లో నటుడు కాదు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాడు . శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం '' డీ '' . కాగా ఆ చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు అయితే ఆ అవకాశం మాత్రం ఇప్పించింది సునీల్ అంట . ఇదే విషయాన్నీ 2 కంట్రీస్ ఆడియో వేడుకలో చెప్పాడు నాని . ఆరోజు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ సినిమాకు పెట్టించింది సునీల్ అన్నయ్యే ! నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటికీ నన్ను బాగా చూసుకునే వాడు అంటూ సునీల్ పై ప్రశంసలు కురిపించాడు నాని .    ఎన్ . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '' 2 కంట్రీస్ '' . మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు . సునీల్ -మనీషా రాజ్ జంటగా నటిస్తున్నారు . ఇప్పటికే పలు ప్లాప్ లతో సతమతం అవుతున్న సునీల్ ఈ 2 కంట్రీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఈనెల లోనే రిలీజ్ కానున్న ఈ చిత్రం పై దర్శక నిర్మాత ఎన్ . శంకర్ కూడా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు . 

అర్జున్ రెడ్డి దర్శకుడితో చరణ్ సినిమా

అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా సంచలన వ్యక్తి అయిపోయాడు దర్శకుడు వంగ సందీప్ రెడ్డి . తక్కువ బడ్జెట్ లో తీసిన అర్జున్ రెడ్డి భారీ విజయాన్ని సాధించడమే కాకుండా భారీ వసూళ్ల ని కొల్లగొట్టింది దాంతో అతడితో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు , నిర్మాతలు పోటీపడుతున్నారు . తాజాగా ఈ దర్శకుడి తో పని చేయడానికి శర్వానంద్ పోటీ పడుతుండగా ఆ దారిలోనే ఉన్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ . తాజాగా తన ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎన్టీఆర్ తో పాటు శర్వానంద్ ని అలాగే సందీప్ రెడ్డి ని ఆహ్వానించాడు చరణ్ .    దాంతో చరణ్ - సందీప్ రెడ్డి ల కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని అంటున్నారు . ప్రస్తుతం చరణ్ రంగస్థలం చిత్రం చేస్తున్నాడు దాని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా అలాగే ఎన్టీఆర్  జక్కన్న లతో కలసి ఒక సినిమా చేయనున్నాడు . దాని తర్వాత ఒకవేళ ఈ అర్జున్ రెడ్డి దర్శకుడి తో సినిమా ఉండొచ్చు . ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే సంచలనమే !

నాని తో సినిమా చేయనున్న మహేష్ సోదరి

మహేష్ బాబు సోదరి మంజుల నాని తో ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన మంజుల తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన మనసుకి నచ్చింది చిత్రానికి దర్శకత్వం వహించి బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు తెచ్చుకుంది . షో చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మంజుల నటిగా , దర్శకురాలిగా , నిర్మాతగా రాణిస్తోంది . మనసుకి నచ్చింది సినిమా రిలీజ్ కాకుండానే నాని తో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది .    అయితే నాని హీరోగా నటించే చిత్రానికి మంజుల దర్శకత్వం వహించకుండా ఆ బాధ్యతలను మనం వంటి క్లాసికల్ హిట్ ని అందించిన విక్రమ్ కుమార్ కు అప్పగిస్తోంది . గతంలో సోదరుడు మహేష్ తో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ని అందించింది మంజుల . అలాగే మరికొన్ని సినిమాల్లో నిర్మాణ భాగస్వామి గా ఉంది కూడా . నాని వరుసగా విజయాలు సాధిస్తుండటంతో అతడితో సినిమా చేయడానికి ముందుకు వచ్చింది మంజుల .

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తోన్న 'మామ ఓ చందమామ'

యంగ్‌ హీరో రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ ఖాన్‌ హీరోయిన్‌గా ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్స్‌ వెంకట్‌ దర్శకత్వంలో వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మామ ఓ చందమామ'. మున్నా కాశీ సంగీతం సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోకి, ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్‌ యు సర్టిఫికెట్‌తో డిసెంబర్‌ 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ సనా మక్బూల్‌ ఖాన్‌ పాల్గొన్నారు.   హీరో రామ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ - ''ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ బేనర్‌లో తొలి ప్రయత్నంగా 'మామ ఓ చందమామ' చిత్రాన్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మా నిర్మాతలు వరప్రసాద్‌, మురళి సాధనాల నిర్మించారు. బేసిగ్గా వారు యు.ఎస్‌.లో సెటిల్‌ అయ్యారు. మన కల్చర్‌, మన ట్రెడిషన్‌, మన రిలేషన్స్‌ గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాలని ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దర్శకుడు విశాఖ ధ్రిల్లర్స్‌ వెంకట్‌ బేసిగ్గా నృత్య దర్శకుడైనా సినిమాని ఎంతో ప్రేమించి అద్భుతమైన సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో చంటి క్యారెక్టర్‌లో నటించాను. విలేజ్‌లో ప్రతి ఒక్కరికీ చేదోడు వాదోడుగా వుంటూ అందర్నీ ప్రేమించి.. అందరి ప్రేమ పొందుతూ చాలా సరదాగా వుండే కుర్రాడి క్యారెక్టర్‌లో నటించాను. ఫస్ట్‌టైమ్‌ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో నటించాను. కామెడీ, లవ్‌, ఎమోషన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. అందరికీ నచ్చే ఒక మంచి సినిమా చేసాం. సుమన్‌, జీవా, గీతాంజలి, సుధ వంటి సీనియర్‌ యాక్టర్స్‌తో కలిసి వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. మున్నా కాశీ అందించిన మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఎల్‌.బాబుగారి కెమెరా విజువల్స్‌ ఫెంటాస్టిక్‌గా వుంటాయి. ఇట్స్‌ ఎ విజువల్‌ ట్రీట్‌ ఫిల్మ్‌. రామ్‌ సుంకర కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌, మాధవ్‌ కోకా ఎడిటింగ్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా నిలుస్తాయి. అలాగే గణేష్‌, సతీష్‌ మాస్టర్స్‌ బ్యూటిఫుల్‌ కొరియోగ్రఫీ కంపోజ్‌ చేశారు. టీమ్‌ అంతా కలిసి ఒక ఆహ్లాదకరమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. 'ఇట్స్‌ మై లైఫ్‌, దృశ్యకావ్యం, ఇద్దరి మధ్య' చిత్రాల తర్వాత నేను చేస్తోన్న చిత్రం ఇది. ఈ డిసెంబర్‌ 15న 15 చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. అన్ని చిత్రాలు ఆడాలి. అందులో మా చిత్రాన్ని కూడా ఆదరించాలి'' అన్నారు.    హీరోయిన్‌ సనా మక్బూల్‌ ఖాన్‌ మాట్లాడుతూ - ''ఇది నా థర్డ్‌ మూవీ. లాస్ట్‌ టైమ్‌ దిక్కులు చూడకు రామయ్య చిత్రంలో నటించాను. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. ఇందులో కార్తీ పాత్రలో నటించాను. అల్లరి చిల్లరగా తిరుగుతూ రఫ్‌గా వుండే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి క్యారెక్టర్‌లో నటించాను. లంగా, ఓణి, చూడీదార్‌లో కనిపిస్తాను. నేను ఎంతో ఎంజాయ్‌ చేస్తూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. రొమాన్స్‌, లవ్‌, కామెడీ, యాక్షన్‌ అంశాలు అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. యూత్‌, ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్‌ చేసేవిధంగా ఈ చిత్రం వుంటుంది. జబర్దస్త్‌ అప్పారావు, గెటప్‌ శ్రీనుల కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. విశాఖ థ్రిల్లర్స్‌ వెంకట్‌ మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌. ఈ చిత్రం అతనికి డైరెక్టర్‌గా మంచి పేరు తెస్తుంది. రాజమండ్రి, వైజాగ్‌, అమలాపురం, చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో చక్కని పంట పొలాల మధ్య చిత్ర షూటింగ్‌ జరిగింది. ఈ సినిమా చేశాక నాకు రాజమండ్రి అంటే ఎంతో ఇష్టం పెరిగింది. డిసెంబర్‌ 15న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..