Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకులు ఎన్ కే విశ్వనాథన్ (75) గుండెపోటుతో  కన్నుమూశారు . తమిళనాట పది సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథన్ కు అగ్ర హీరోలు  కమల్ హాసన్ , రజనీకాంత్ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి . అగ్ర హీరోలు నటించిన సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసాడు విశ్వనాథన్ . ఆ తర్వాత దర్శకుడిగా మారిన విశ్వనాథన్ తమిళంలో పది చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాడు .     గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్ మంగళవారం రోజున గుండెపోటుతో మరణించాడు . విశ్వనాథన్ మరణం తెలిసిన వెంటనే కమల్ హాసన్ , సత్యరాజ్ తదితరులు విశ్వనాథన్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు . కాగా నిన్న విశ్వనాథన్ అంత్యక్రియలు జరిగాయి .

మహేష్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్

మహేష్ బాబు కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు . మహేష్ కు అల్లు అర్జున్ వ్యతిరేకం ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహేష్ తో పాటుగా అల్లు అర్జున్ కూడా పలు బ్రాండ్ లకు ప్రచారకర్త గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఇద్దరు కూడా పోటీపడి బ్రాండ్ అంబాసిడర్ లుగా రాణిస్తున్నారు . కాగా తాజా పోటీ ఏంటంటే ........ ....... మహేష్ బాబు అభి బస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు కాగా తాజాగా దానికి పోటీగా అల్లు అర్జున్ రెడ్ బస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు .     ఇద్దరు స్టార్ హీరోలు రెండు పోటీగా ఉన్న వాటికి బ్రాండ్ అంబాసిడర్ లు కావడంతో పోటీ తీవ్రత ఎక్కువ కావడం ఖాయం . మహేష్ తో పోటీ పడి పలు బ్రాండ్ లను సొంతం చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ . కాగా ఇప్పుడు అభి బస్ తో రెడ్ బస్ పోటీ పడనుంది .

బాహుబలి 2యూనిట్ కు ఘోరమైన అవమానం

బాహుబలి 2 యూనిట్ కు ఘోరమైన అవమానం ఎదురయ్యింది , ఇంతకీ ఆ అవమానం ఎక్కడ జరిగిందో తెలుసా ....... దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో . బాహుబలి 2 ప్రమోషన్ కోసం ఇటీవల దుబాయ్ వెళ్లారు ఆ చిత్ర బృందం అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో జాతి వివక్ష తో బాహుబలి యూనిట్ ని అవమానించారు దుబాయ్ వాళ్ళు . దాంతో షాక్ అయ్యారు ఆ చిత్ర బృందం .     ప్రభాస్ , రానా , అనుష్క ,రాజమౌళి లతో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ లు దుబాయ్ వెళ్లారు . అయితే ప్రపంచ వ్యాప్తంగా జాతి వివక్ష పెద్ద ఎత్తున ప్రబలుతున్న విషయం తెలిసిందే . ఎమిరేట్స్ విమానం ఎక్కడానికి వస్తున్నా సమయంలో గేట్ బి 4వద్ద విమాన సిబ్బంది బాహుబలి యూనిట్ ని అవమానానికి గురి చేసింది . అయితే ఈ అవమానాన్ని భరించి ఇండియాకు తిరిగి వచ్చారు . కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత మాత్రం అవమానం గురించి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతున్నాడు . 

`పిశాచి 2` సక్సెస్ మీట్‌

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2` . `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్.   ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ను నిర్మాత ల‌య‌న్ సాయి వెంక‌ట్ స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...   ల‌య‌న్ సాయివెంక‌ట్ మాట్లాడుతూ - ``ఈ సినిమాను నేను తెలుగులో నిర్మాత‌గా విడుద‌ల చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం త‌మ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌. ప‌బ్లిసిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేశాం. ఏప్రిల్ 21న విడుద‌లైన చిత్రాల్లో థియేట‌ర్స్‌తో పాటు క‌లెక్ష‌న్స్ పెరిగిన ఏకైక సినిమా మా పిశాచి 2. ప్ర‌తిరోజూ హిట్ టాక్‌తో థియేట‌ర్స్ పెరుగుతూ వ‌చ్చాయి. ఈ మేజ‌ర్ స‌క్సెస్‌కు కార‌ణం డిస్ట్రిబ్యూట‌ర్స్‌. అందుక‌నే వారిని స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను`` అన్నారు.    రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ``కంటెంట్ ఉన్న సినిమాలు స‌క్సెస్ అవుతాయ‌న‌డానికి పిశాచి 2 వంటి సినిమాలే ఉదాహ‌ర‌ణ‌. విడుద‌లైన రోజు నుండి స‌క్సెస్ టాక్‌తో కలెక్ష‌న్స్ ప‌రంగా, థియేట‌ర్స్ ప‌రంగా సినిమా మంచి ఆద‌ర‌ణ‌ను పొందుతుంది. సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు  థాంక్స్‌`` అన్నారు.     చిత్ర హీరోయిన్ శిప్రా  గౌర్ మాట్లాడుతూ...  హిందీలో ఒకటి, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 గా రిలీస్ అయిన ఈ చిత్రం క‌న్న‌డంలో కూడా పెద్ద హిట్ అయ్యింది.  తెలుగు, క‌న్న‌డంలో సినిమాను ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.    ఆర్‌.కె.గౌడ్ మాట్లాడుతూ - ``సినిమా బావుంటే చాలు ప్రేక్ష‌కులు ఆ సినిమా అనువాద సినిమానా, స్ట్ర‌యిట్ సినిమానా అని చూడ‌రు. ఆద‌రిస్తారు. బాహుబ‌లి2 ను కూడా త‌ట్టుకుని కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.    శివాజీ రాజా మాట్లాడుతూ - ``సినిమాలు హండ్రెడ్ డేస్ ఆడే రోజులు పోయాయి. ఇలాంటి త‌రుణంలో చిన్న సినిమాను బ్ర‌తికించవ‌ల‌సిన అవ‌సరం ఎంతైనా ఉంది. పిశాచి 2 సినిమాను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. పెద్ద హిట్ చేశారు`` అన్నారు.

స్లొవేనియా వెళ్తున్న 'జయదేవ్‌'

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాత కె.అశోక్‌కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.    ఏప్రిల్‌ 27న 'జయదేవ్‌' టీజర్‌  నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''జయంత్‌ దర్శకత్వంలో ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌ తర్వాత మూడో చిత్రంగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుగారి తనయుడు గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'జయదేవ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నాము. వివిధ లొకేషన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ భారీ లెవ్‌ల్‌లో చేశాం. ఏప్రిల్‌ 27 సాయంత్రం గం 4.25లకు 'జయదేవ్‌' టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ 30న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు స్లొవేనియాలో రెండు పాటల్ని చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. మే చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.    దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఈచిత్రంలో వున్నాయి. ఇది ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని డిజైన్‌ చెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌ అవుతాయి. అశోక్‌కుమార్‌గారి బేనర్‌లో 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాం. మళ్ళీ ఇదే బేనర్‌లో 'జయదేవ్‌' చిత్రంతో గంటా రవిని హీరోగా నా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.    గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.    ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

బాహుబలి 2 ఫస్ట్ డే వంద కోట్ల ని దాటుతుందా

బాహుబలి 2 కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు . ఈ సినిమా  భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో  రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మొదటి రోజు అవలీలగా వంద కోట్లకు పైగా  రాబట్టగలదని ట్రేడ్ విశ్లేషకులు గోరంట్ల సత్యం తేల్చి చెప్పేసారు . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 900 ల స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం తో కళ్ళు చెదిరే కలెక్షన్లు రావడం ఖాయమని తొలిరోజు రికార్డ్ ని బాహుబలి 2 పేరిట నమోదు కావడం కూడా ఖాయమని అంటున్నారు .     మొదటి రోజున 100 కోట్ల నుండి 150 కోట్ల మధ్య న వసూల్ చేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . పైగా ఈ చిత్రానికి కలిసి వచ్చే మరో అదృష్టం ఏంటంటే ....... టికెట్ల రేట్లని పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఆరు ఆటలు తెలంగాణలో 5 ఆటలు పడనున్నాయి దాంతో భారీ వసూళ్లు రావడం ఖాయం . మొత్తానికి మొదటి రోజు నుండే బాహుబలి 2 సంచలనాలకు కేంద్ర బిందువు కావడం ఖాయంగా కనిపిస్తోంది . 

మరో మెగా హీరోని పట్టేసింది ఈ భామ

ఇప్పటికే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన సుప్రీమ్ చిత్రంలో నటించిన భామ రాశి ఖన్నా తాజాగా మరో మెగా హీరోని బుట్టలో పడేసింది . నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది రాశి ఖన్నా . ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్ సరసన జై లవకుశ చిత్రంలో నటిస్తోంది . ఎన్టీఆర్ తో మాత్రమే కాకుండా రవితేజ సరసన '' టచ్ చేసి చూడు '' చిత్రంలో నటిస్తోంది .     ఇక గోపీచంద్ సరసన నటించిన ఆక్షీజన్ చిత్రం పూర్తయ్యింది , అది రిలీజ్ కావాల్సి ఉంది . అగ్ర హీరోలతో వరుసగా రెండు సినిమాలు చేస్తున్న సమయంలో మెగా హీరో అందునా యంగ్ హీరో చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో రాశి ఖన్నా సంతోషంగా ఉంది . ఈ దెబ్బతో తన కెరీర్ గాడిలో పడటం ఖాయమని అగ్ర హీరోయిన్ ని అవుతాననే ఆశగా ఉంది ఈ భామ . 

మాట తప్పిన త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన మాట తప్పాడు , పైగా దాని గురించి ఊసు కూడా ఎత్తలేదు కనీసం ఇప్పుడు కూడా . ఇంతకీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన మాట ఏంటో తెలుసా ...... ....... కళాతపస్వి కే . విశ్వనాధ్ అంటే నాకు చాలా ఇష్టమని , ఆయన ఒప్పుకుంటే ...... సినిమా చేస్తానంటే నేనే ఆ సినిమాని నిర్మిస్తాను అంటూ సభా వేదిక మీద మాటిచ్చాడు త్రివిక్రమ్ . కానీ ఆ విషయాన్నే మర్చిపోయాడు మాటల మాంత్రికుడు .     అయితే అప్పుడెప్పుడో ఇచ్చిన మాట గుర్తు లేదని అనుకుందాం ,మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కళాతపస్వి కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది . పైగా కే విశ్వనాధ్ కూడా డైరెక్షన్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు . మరి ఈ సందర్భంలో నైనా త్రివిక్రమ్ ఓ సినిమా నిర్మించడానికి ముందుకు వస్తాడా ? చూడాలి . ఎందుకంటే త్రివిక్రమ్ దగ్గర ఇప్పుడు కావలసినంత డబ్బు ఉంది కదా ! 

బాహుబలి 2 మొత్తంగా ఎన్ని కోట్లని కలెక్ట్ చేస్తుంది

1) 350 కోట్లు  2) 400 కోట్లు  3) 500 కోట్లు  4) 700 కోట్లు  5) 1000 కోట్లు   

కళాతపస్విని మెచ్చిన పవన్ కళ్యాణ్

కళాతపస్వి కే విశ్వనాధ్ కు కేంద్ర ప్రభుత్వం '' దాదా సాహెబ్ ఫాల్కే '' అవార్డు ప్రకటించిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే విశ్వనాధ్ ని కలిసి శుభాకాంక్షలు అందజేశారు . పవన్ వెంట దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు . విశ్వనాధ్ గారి గురించి మాట్లాడే అర్హత , వయసు , అనుభవం నాకు లేవని , అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ , స్వయం కృషి , స్వాతి ముత్యం , శంఖరాభరణం తదితర చిత్రాలంటే నాకు ఎంతగానో ఇష్టం . అటువంటి గొప్ప వ్యక్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యాల్లాంటి సినిమాలను ఒక డిస్క్ గా పేర్చి తే బాగుంటుందని అన్నారు .     భారతదేశం గర్వించతగ్గ గొప్ప చిత్రాలను తెలుగుదనం ఉట్టి పడే చిత్రాలను రూపొందించిన కే విశ్వనాధ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పులకించి పోతోంది . 

బాహుబలి 2లీక్ కాలేదట

బాహుబలి 2 రిలీజ్ కి ముందే లీక్ అయ్యిందని , షోలు పడ్డాయని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనడంతో అదంతా నిజామేనా ? అని అనుకున్నారు కట్ చేస్తే ఈ ప్రచారం ఎక్కువ అవుతుండటం , స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని ఫోటోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఎట్టకేలకు స్పందించాడు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ .     బాహుబలి 2 ని ముందుగా ఎక్కడ కూడా షోలు వేయలేదని , అయితే సెన్సార్ కోసం ఆయా దేశాల్లో , రాష్ట్రాలలో షో వేశారు కాబట్టి సెన్సార్ సభ్యులు చూస్తున్న సమయంలోని ఫోటోలే సోషల్ మీడియాలో నానుతున్నట్లు భావిస్తున్నామని స్పష్టం చేసాడు శోభు . అలాగే బాహుబలి 2 లీక్ కాలేదని కూడా స్పష్టం చేసాడు శోభు యార్లగడ్డ . 

ముస్తాబవుతున్న సందీప్ కిషన్ 'నక్షత్రం'

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.'నక్షత్రం' చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ గీతాన్ని ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించ నున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.అలాగే చిత్రం టీజర్ విడుదల ను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రం లో సుప్రీం హీరో 'సాయి ధరమ్ తేజ్' పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే నెలలో ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. 'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.

బికినీలో రచ్చ రచ్చ చేస్తున్న భామ

బాలీవుడ్ లో నటించింది అందాలను ఆరబోసింది కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది దాంతో దక్షిణాది బాట పట్టింది హాట్ భామ రుహి సింగ్ . ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం చేస్తోంది ఈ భామ అయితే దక్షిణాది లో జెండా పాతాలని భావించిన ఈ భామ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది . బికినీ కూడా వేయడానికి అభ్యంతరం లేదని దర్శక నిర్మాతలకు చెప్పడమే కాకుండా వాళ్ళని ఒప్పించి మరీ బికినీ వేసి ఓ పాటలో రెచ్చిపోయిందట.కామన్ గా బికినీ వేయాలని దర్శక నిర్మాతలు హీరోయిన్ ని కోరతారు ,అప్పుడు హీరోయిన్ సీన్ ఏంటి ? అంత డిమాండ్ ఉందా ? అనిఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో రుహి అడగడం , దర్శక నిర్మాతలు ఒప్పుకోవడం జరిగింది . ఇక బికినీ రుహి సింగ్ అందాలు మరింత ఊపు నిచ్చేలా ఉన్నాయట కుర్రాళ్లకు . ఈ దెబ్బ తో ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది రుహి . మరి సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.

ఆగస్టు 9న మహేష్ స్పైడర్ రిలీజ్

మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న స్పైడర్ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అది ఇప్పుడు ఆగస్టు కు వాయిదా పడింది . ఆగస్టు 9న స్పైడర్ సినిమా ని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారట . ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే . రెండేళ్ల క్రితం మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ఆగస్టు 7న రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.సరిగ్గా మళ్ళీ రెండేళ్ల తర్వాత మహేష్ పుట్టినరోజు న రిలీజ్ అవుతున్న స్పైడర్ కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు . మహేష్ పుట్టినరోజు న స్పైడర్ సినిమా రిలీజ్ అంటే మహేష్ ఫ్యాన్స్ కు ఏకంగా రెండు పండగలు అన్నమాట . తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

ఈ సుందరి ఎవరో చెప్పండి

ముఖానికి తెల్లటి గుడ్డలు కట్టుకొని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని ఫోటో కి ఫోజివ్వడమే కాకుండా ఆ ఫోటో ని సోషల్ మీడియాకి వదిలేసింది ఇంకేముంది ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇంతకీ ముఖం కనిపించకుండా తెల్లటి గుడ్డ కట్టుకున్న భామ ఎవరో తెలుసా ....... కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ . హైదరాబాద్ లో ఎండలు తీవ్ర స్థాయిలో మండుతున్నాయి దాంతో షూటింగ్ చేయడం కష్టం అవుతోంది.అయితే ఎండగా ఉంది కదా అని షూటింగ్ ఆపేయలేరు కదా ! అందుకే ఎండ నుండి ఉపశమనం పొందడానికి ఇలా ముఖానికి తెల్లగుడ్డ లు పెట్టేసుకుంది షాట్ గ్యాప్ లో . ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ సరసన స్పైడర్ చిత్రంలో నటిస్తోంది.

బాహుబలి2 టికెట్లు 500 ఉన్నాయట ఆమె దగ్గర

బాహుబలి 2 ఒక్క టికెట్ దొరికిన చాలు అని ఎదురు చూస్తున్నారు జనాలు కానీ ఒకరి దగ్గర మాత్రం ఏకంగా అయిదు వందల టికెట్లు ఉన్నాయట ! ఇప్పుడు ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది . ఇంతకీ 500 టికెట్లు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా ....... వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రా పాలి దగ్గర . కలెక్టర్ గా తనదైన ముద్ర వేసి సంచలనం సృష్టిస్తున్న అమ్రా పాలి తాజాగా బాహుబలి 2 కోసం ఏకంగా ఓ థియేటర్ ని ఒక షోకి మొత్తంగా బ్లాక్ చేసి పెట్టింది.అయితే ఇన్ని వందల టికెట్లు ఎవరెవరి కోసం అన్నది తెలియాల్సి ఉంది . ఆమె కుటుంబం , మిత్రుల కోసమా ? లేక ఇతర అధికారుల కోసం కూడానా అన్నది తెలియాల్సి ఉంది . అయితే బాహుబలి 2 టికెట్ల కోసం మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది . ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఉదయ్ కిరణ్ ని దత్తత తీసుకుందామనుకుందట

చిరంజీవి పెద్ద కూతురు తో వివాహ నిశ్చితార్థం రద్దు అయినప్పుడు ఉదయ్ కిరణ్ నా దగ్గరకు వచ్చి బోరున విలపించాడని , ఉదయ్ కిరణ్ నాకు కొడుకు లాంటి వాడని అయితే దత్తత తీసుకుందామని అనుకున్నాను కానీ ఈలోపే ఆత్మహత్య చేసుకొని మరింత షాక్ ఇచ్చాడని అంటోంది సీనియర్ నటి సుధ . తల్లిగా ,వదినగా పలు రకాల పాత్రలను పోషించి తెలుగు తెరమీద తనదైన ముద్ర వేసిన నటి ఈ సుధ.ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డానని , ఒకవేళ ఉదయ్ ని దత్తత తీసుకొని ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది సుధ . ఇక చిత్ర పరిశ్రమలో నాకు చిరంజీవి , నాగార్జున చాలా క్లోజ్ అని ఒక సమయంలో చావుకి దగ్గరగా వెళ్లిన సమయంలో నాగార్జున కుటుంబం నన్ను ఆదుకుందని అందుకే నాగార్జున అంటే నాకు చాలా చాలా ఇష్టమని అంటోంది సుధ . అంతేకాదు ఇప్పుడు తల్లి పాత్రలు అంతగా ప్రాధాన్యత లేకుండా పోయాయని కూడా చురకలు వేసింది సుధ.

ప్రభాస్ కు డూప్ గా నటించింది ఎవరో తెలుసా

బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఎత్తైన కొండలను అవలీలగా ఎక్కుతుంటాడు , అది గ్రాఫిక్ మాయాజాలం అన్న విషయం తెలిసిందే ,  ఆ మాయాజాలం చేయడానికి ముందు కొంత రిస్కీ షాట్స్ కూడా చేసాడు ప్రభాస్ . అయితే ప్రభాస్ రిస్కీ షాట్స్ చేసినప్పటికీ మరింత కఠినతరమైన షాట్ లను ప్రభాస్ డూప్ తో చిత్రీకరించారు దర్శకులు రాజమౌళి . ఇంతకీ ప్రభాస్ కి డూప్ గా నటించింది ఎవరో తెలుసా ........కిరణ్ రాజ్.అవును కిరణ్ రాజ్ అనే వ్యక్తి ప్రభాస్ హైట్ ఉండటమే కాకుండా దేహ దారుడ్యంలో కూడా ప్రభాస్ కు సమకాలికుడు లా ఉన్నారు అందుకే అతడ్ని ప్రభాస్ కు డూప్ గా ఎంపిక చేసారు జక్కన్న . ప్రభాస్ తెరమీద చేసిన సాహసాల్లో ఇతడి వాటా కూడా ఉంది సుమా !

దక్షిణ భారత సినీ స్టార్స్‌ గెస్ట్‌లుగా 'లవర్స్‌తో పెట్టుకోవద్దు'

ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ దర్శకత్వంలో మహేష్‌, పియా బాజ్‌ఫాయ్‌ జంటగా ఎస్‌.కె. కరిమున్నీసా నిర్మించిన చిత్రం 'లవర్స్‌తో పెట్టుకోవద్దు'. ఆద్యంతం హంగ్‌కాంగ్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలో దక్షిణ భారత సినీ సెలబ్రిటీలు ఓ సన్నివేశంలో కనిపించి అలరించనున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ..హంగ్‌కాంగ్‌ చిత్రీకరించిన సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ చిత్రానికి ప్రముఖ హీరో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన విజయ్‌ ఆంటోని సంగీతాన్ని అందించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, మెగాస్టార్‌ చిరంజీవి, యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, డేరింగ్‌ స్టార్‌ విజయ్‌కాంత్‌లు కనిపించనున్నారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురానున్నాము..అని అన్నారు. మ్యూజిక్‌: విజయ్‌ ఆంటోని, సినిమాటోగ్రఫీ: సి.జె. రాజ్‌కుమార్‌, నిర్మాత: ఎస్‌.కె. కరిమున్నీసా, దర్శకత్వం: ఎస్‌.కె.బషీద్‌. 

జై లవకుశ శాటిలైట్ కు భారీ ఆఫర్

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న చిత్రం '' జై లవకుశ ''. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే జెమిని టీవీ 14 కోట్లకు శాటిలైట్ రైట్స్ ని కొనుక్కుందని అంటున్నారు . ఎన్టీఆర్ నటించిన టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాలు వరుసగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి . ఆ చిత్రాల జోరు తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో జై లవకుశ పై భారీ అంచనాలు ఉన్నాయి .  అందుకే భారీ ఆఫర్ లు వస్తున్నాయి ఈ సినిమా కోసం .     అయితే డిమాండ్ ఉండగానే సర్దేసుకుంటే బెటర్ అని భావించిన జెమిని టివి శాటిలైట్ హక్కులను  14 కోట్లకు సొంతం చేసుకుంది . ఇక ఏరియాల వైజ్ కూడా బాగానే డిమాండ్ ఉంది ఈ సినిమాకు . మొత్తంగా రిలీజ్ కి ముందే 30 కోట్లు టేబుల్ ప్రాఫిట్ రానుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 

ఈ భామ ఆ సినిమా ఎందుకు ఒప్పుకుందో తెలుసా

అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేస్తోంది . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది . అయితే ముందుగా ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందో తెలుసా ........ కేవలం త్రివిక్రమ్ కోసమే నట ! త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని ఈ భామకు ఆశగా ఉందట ! అందుకే త్రివిక్రమ్ సినిమా లో నటించాలి మీకు కథ చెబుతాడు అని కబురు రాగానే కథ విషయం పక్కన పెట్టి ముందుగానే ప్రిపేర్ అయ్యిందట ఒప్పుకోవడానికి .     అయితే త్రివిక్రమ్ మాత్రం కథ చెబుతాను అని స్టార్ట్ చేసిన తర్వాత ఆ కథలో , క్యారెక్టర్ లో లీనమై పోయిందట . క్యారెక్టర్ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకుందట అంతేనా ....... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో కావడంతో ఎగిరి గంతేసిందట . మొత్తానికి తన్నకుండానే బూరెల బుట్టలో పడింది . ఒకవైపు పవర్ స్టార్ సినిమా మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వం డబుల్ బొనాంజా అంటే ఇదే మరి . 

క్లైమాక్స్ మళ్ళీ రాస్తున్నారట

మహేష్ బాబు స్పైడర్ సినిమా ఇంతకుముందు అనుకున్న డేట్ ప్రకారం జూన్ 23న రిలీజ్ కావాల్సి ఉంది కానీ అది ఇప్పుడు వాయిదా పడింది దానికి కారణం ఏంటో తెలుసా ....... క్లైమాక్స్ ని మళ్ళీ రాస్తున్నాడట దర్శకులు మురుగదాస్ . సినిమా ప్రారంభంలో అనుకున్న క్లైమాక్స్ కి బదులుగా మరో క్లైమాక్స్ అయితే బాగుంటుంది అని మురుగదాస్ కు ఆలోచన రావడం అది మహేష్ కు చెప్పడం దానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చక చకా జరిగి పోయాయట . అందుకే స్పైడర్ సకాలంలో రిలీజ్ కావడం లేదు .     మురుగదాస్ అనుకున్న క్లైమాక్స్ రాయాలి అది మహేష్ కు వినిపించాలి దానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అప్పుడు షూటింగ్ చేయాలి ఆ తర్వాతే రిలీజ్ అన్నమాట . అంటే స్పైడర్ సినిమాని ప్రేక్షకులు చూడాలంటే జులై కూడా డౌటే ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందే . 

చరణ్ ప్రచారం చేస్తాడా

బాబాయ్ వెంటే మేమంతా అంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు రాంచరణ్ తేజ్ . గత ఎన్నికల్లో నాన్న వెంటే మేమంతా అంటూ నాగబాబు , చరణ్ , అల్లు అర్జున్ , అల్లు అరవింద్ తదితరులంతా చిరంజీవి వెంట ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే టిడిపి - బిజెపి కూటమి కి మద్దతు ఇచ్చి ఆ పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చాడు . కట్ చేస్తే ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ బాబాయ్ వెంటే నేను సైతం అని అంటూ ప్రకటన చేసాడు చరణ్ .      తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు చరణ్ . ఆ సినిమా షూటింగ్ కోసం ఉభయ గోదావరి జిల్లాలలో సందడి చేస్తున్నాడు . కాగా చరణ్ ని చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తండోప తండాలుగా వస్తుండటంతో షూటింగ్ కి ఇబ్బంది కలుగుతోంది అయినప్పటికీ అభిమానులు చూపిస్తున్న ప్రేమ కోసం భరిస్తున్నాడు చరణ్ . అయితే పెద్ద ఎత్తున వస్తున్న మెగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడిన చరణ్ ఈసారి ఎన్నికల్లో బాబాయ్ వెంటే ఉంటానని చెప్పి సంచలనం సృష్టించాడు .

జగపతిబాబు 'సూర్యాభాయ్‌' చివరి షెడ్యూల్‌ షూటింగ్‌

ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్‌, శ్రీ తిరుమల సినిమాస్‌ పతాకాలపై అర్జున్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'సూర్యాభాయ్‌'. బి.వి. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని మే 5 నుండి జరుపనున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం మాట్లాడుతూ..''అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. టైటిల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో జగపతిబాబు గారి పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పొలిటికల్‌ సెటైరికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. సెంటిమెంట్‌, ఎమోషనల్‌, ఫ్యామిలీ డ్రామా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులందరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్‌ వాసుదేవ్‌ తీర్చిదిద్దుతున్నారు. ప్రదీప్‌రావత్‌, షాయాజీషిండే, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, అర్చన ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబుగారి సరసన నటిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కిస్తున్నాము. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మే 5 నుండి జరిపే చివరి షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. జూన్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం..''అన్నారు.  ఓ ప్రముఖ హీరోయిన్‌ జగపతిబాబు సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాయాజీషిండే, ప్రదీప్‌రావత్‌, సుమన్‌, సాయికుమార్‌, డి.ఎస్‌.రావ్‌, రాజారవీంద్ర, ఉత్తేజ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, దిల్‌ రమేష్‌, అర్చన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.వి. రామకృష్ణ, సంగీతం: ఆనంద్‌, ఆర్ట్‌: జె.కె. మూర్తి, ఫైట్స్‌: నందు, పి.ఆర్‌.ఓ. జిల్లా సురేష్‌, నిర్మాతలు: రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం, దర్శకత్వం: అర్జున్‌ వాసుదేవ్‌.

దోపిడీ కి కేరాఫ్ అడ్రస్ బాహుబలి

బాహుబలి పేరుతో దొరికినంత దోచుకుంటున్నారు , దోపిడీ కి కేరాఫ్ అడ్రస్ గా బాహుబలి నిలిచింది . బాహుబలి టికెట్ల పేరుతో ఎవరికి వారు డ్రామా లాడుతూ ప్రేక్షకులను దోచుకుంటున్నారు . బాహుబలి కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు . ఒకవైపు జక్కన్న అండ్ కో ఈ దోపిడీ పాల్పడుతుండగా అదే దారిలో కొంతమంది దొంగలు తయారయ్యారు . బాహుబలి 2 ని త్వరగా చూడాలనే ఆత్రుత లో ఓ ఫేక్ వెబ్ సైట్ చేసిన దోపిడీ కి లబోదిబో మంటున్నారు ప్రేక్షకులు .     www. newtickets.in అనే వెబ్ సైట్ బాహుబలి 2 టికెట్లు ఉన్నాయని భ్రమింపజేసి డబ్బులు నొక్కేసింది . దాంతో టికెట్ల ని బుక్ చేసుకుని మోసపోయిన వాళ్ళు సైబర్ పోలీసులను ఆశ్రయించారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆ వెబ్ సైట్ ఫేక్ అని తేలింది దాంతో మీడియా ముందుకు వచ్చి ప్రేక్షకులను మోసపోవద్దని చెబుతున్నారు పోలీసులు . 

మహేష్ కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో '' స్పైడర్ '' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా రిలీజ్ కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో నటించే సినిమా ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించాడు . మహేష్ - కొరటాల శివ ల కొత్త సినిమా ప్రారంభం అయ్యేది ఎప్పుడో తెలుసా ........ మే 18న . అవును మే 18న అధికారికంగా ఈ సినిమా ప్రారంభించడానికి డేట్ ఫిక్స్ చేసారు .      ఇక ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా ...... ''భరత్ అను నేను '' . పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఆ చిత్రంలో మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా ఎంపిక చేసారు అలాగే మరో హీరోయిన్ గా కియారా అద్వానీ ని కూడా ఫైనల్ చేసారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం శ్రీమంతుడు కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నారు ఆ చిత్ర బృందం . 

మహాభారతం లో ప్రభాస్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి గా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం '' మహాభారత్ '' లో నాకు అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో  మహాభారత చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు . అందులో భీముడిగా మోహన్ లాల్ ని ఎంపిక చేసారు కాగా మోహన్ లాల్ ఎంపిక సరైనదే అంటూ కితాబు నిచ్చాడు ప్రభాస్ . అదే సమయంలో అంత పెద్ద ప్రాజెక్ట్ లో నాకు ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అంటున్నాడు .     ఇప్పటికే శ్రీకృష్ణుడి గా మహేష్ బాబు అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు ఆ చిత్ర బృందం , మహేష్ ఒప్పుకుంటాడా లేదా అన్నది పక్కన పెడితే ప్రభాస్ కూడా రెడీ అవుతున్నాడు ఏదో ఒక క్యారెక్టర్ చేయడానికి . ప్రభాస్ రెడీ అంటున్నాడు మరి ఆ చిత్ర దర్శక నిర్మాతలు ప్రభాస్ కు ఏ క్యారెక్టర్ ఇస్తారో చూడాలి .

పంది హీరోగా సినిమా నట

ఇప్పటి వరకు రకరకాల పక్షులు , జంతువులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రాలు రాగా అందులో ఈగ చిత్రం పెద్ద హిట్ అయ్యింది . దాంతో తమిళంలో ఓ పంది హీరోగా సినిమా ప్రారంభం అయ్యింది . తెలుగులో కూడా రవిబాబు ఓ పందిపిల్ల తో సినిమా చేసాడు అది రిలీజ్ కి సిద్ధంగా ఉంది , అయితే దాని కథాంశం ఏంటో తెలియదు కానీ తమిళ పంది మాత్రం వ్యాపార దృక్పధం తోనే మన పక్కనున్న దేశాలు మనతో స్నేహాన్ని కోరుకుంటున్నాయి అని వాళ్ళ స్వార్థం ఏంటో తెలియజెప్పే కథాంశం తో ఈ పంది రెడీ అవుతోందట .     తెల్లపంది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జగన్ సాయి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈగ ఎంతటి సంచలనం సృష్టించిందో మా పంది కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర యూనిట్ .

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది: మెగాస్టార్ చిరంజీవి

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు  ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి  రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు  ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నా. అవార్డు  రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా?  లేదా అన్న దానిపై ఇప్పుడు  మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌న్ను వ‌రించ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఆయ‌న‌కు అవార్డు రావ‌డం తో ఆ అవార్డుకు నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా శుభాబివంద‌నాలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే` అని అన్నారు.

చిరంజీవి కొత్త సినిమా ప్రారంభమెప్పుడో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ప్రారంభానికి రంగం సిద్ధం అవుతోంది , ఇంతకీ చిరు 151వ సినిమా ప్రారంభం ఎప్పుడో తెలుసా ....... ఇంకెప్పుడు చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న కొత్త సినిమా ప్రారంభం కానుంది . సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మళ్ళీ చరణ్ నిర్మిస్తుండటం విశేషం . స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా చిరంజీవి చిత్రం తెరకెక్కనుంది.చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా నటించనున్నాడు . బ్రిటీష్ పాలకులపై స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరో దాత్తుడు ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి . బయోపిక్ లు బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి ,కాగా తెలుగులో కూడా చారిత్రాత్మక చిత్రాలు ఘనవిజయం సాధిస్తుండటం తో చిరు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..