Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

నాని సినిమాకు విచిత్రమైన టైటిల్

వరుస విజయాలు సాధిస్తున్న నాని తాజాగా ఎం సి ఏ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే , దాంతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే సినిమా కూడా చేస్తున్నాడు . అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు నాని . శేఖర్ కమ్ముల సినిమా మాత్రమే కాకుండా నేను శైలజ వంటి బ్లాక్ బస్టర్ కు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు , మైత్రి మూవీస్ సంస్థ నిర్మించనున్న ఆ చిత్రానికి విచిత్రమైన టైటిల్ ని రిజిస్టర్ చేయించారు మైత్రి మూవీస్ వాళ్ళు .      ఇంతకీ వాళ్ళు రిజిస్టర్ చేయించిన టైటిల్ ఏంటో తెలుసా ....... ..... చిత్రలహరి . అవును'' చిత్రలహరి ''అనే టైటిల్ ని అనుకుంటున్నారట . అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . అప్పట్లో దూరదర్శన్ లో చిత్రలహరి అనే పాటల కార్యక్రమం వచ్చేది . ఆ కార్యక్రమం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు 80 వ దశకంలో . తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది .

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏంటో తెలుసా

ఇటీవలే అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాకు రెడీ అయ్యాడు . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్నా కొత్త సినిమా ఏంటో తెలుసా  ........ .....'' ఏ మంత్రం వేసావే '' . శ్రీధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ స్టిల్ బాగుంది . చూస్తుంటే ఈ సినిమా  కూడా యువత ని మాయ చేసేలా ఉంది . పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించిన విజయ్ కి అర్జున్ రెడ్డి స్టార్ డం ని తెచ్చిపెట్టింది .      ఏమంత్రం వేసావే సినిమాతో పాటుగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది . అతడికి తెలంగాణ స్లాంగ్ కూడా బాగా కలిసొచ్చింది . మొత్తానికి మరో రెండు హిట్ లు కొడితే మరింతగా అతడి రేంజ్ పెరగడం ఖాయం గా కనిపిస్తోంది .

కలెక్షన్లతో దుమ్మురేపుతున్నాడు

తమిళ స్టార్ హీరో విజయ్ కి తమిళనాట తిరుగులేని ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే . విజయ్ నటించిన మెర్సల్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది . భారీ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కావడంతో పాటు విజయ్ స్టార్ డం కూడా తోడవడంతో భారీ కలెక్షన్ల ని కొల్లగొట్టింది . నిన్న ఎన్ని కోట్ల ని కొల్లగొట్టాడో తెలుసా ....... ఒక్కరోజు లోనే 31 కోట్ల కు పైగా వసూల్ చేసాడు విజయ్ . తమిళనాట మాత్రమే కాక వరల్డ్ వైడ్ గా విజయ్ కి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు . దాంతో ఈ సినిమాని అమెరికాతో పాటుగా మలేషియా , యూకే , ఆస్ట్రేలియా లలో కూడా రిలీజ్ అయ్యింది మెర్సల్ చిత్రం .      అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ని విపరీతంగా అలరిస్తోంది . సినిమాకు హిట్ టాక్ రావడం తో భారీ వసూళ్ల ని సాధిస్తున్నాడు విజయ్ . టాక్ కి తగ్గట్లుగా దీపావళి సెలవులు కూడా తోడవుతున్నాయి దాంతో విజయ్ కెరీర్ లో మరో భారీ హిట్ లభించినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . విజయ్ సరసన సమంత , కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ లు నటించిన మెర్సల్ తెలుగులో అదిరింది గా రిలీజ్ కానుంది . 

షూటింగ్ పూర్తిచేసుకున్న బేవ‌ర్స్ చిత్రం

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని రెండింత‌లు సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌.  ఈ చిత్రం తో సంజోష్ హీరో గా ప‌రిచ‌యం అవుతున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో  S క్రియెష‌న్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, ఎమ్  అర‌వింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. ఇటీవ‌లే సార‌ధి స్టూడ‌యోలో వేసిన భారీ సెట్ లో చేసిన సాంగ్ షూట్ తో చిత్ర షూటింగ్ పూర్తిచేసుంది.  హ‌ర్షిత లు ఈ చిత్రంలో  హీరోయిన్ గా చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. సునీల్ కాశ్య‌ప్ సంగీతాన్ని అందించారు.   ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు  పొన్నాల చందు, ఎమ్‌. అర‌వింద్ లు మాట్లాడుతూ..  డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు న‌టించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఓక‌టి. అలాంటి చిత్రానికి రైట‌ర్ గా ప‌నిచేసిన ర‌మేష్ చెప్పాలా ద‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌. మా బ్యాన‌ర్  S క్రియెష‌న్స్ పై ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. ఇటీవ‌లే మంచి సాంగ్ షూట్ తో చిత్ర షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో సంజోష్‌, హ‌ర్షిత లు హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. దీపావ‌ళి పండ‌గ పుర‌స్క‌రించుకుని ఓ మంచి సాంగ్ చిత్రీక‌ర‌ణ కూడా చేశాము. దీపావ‌ళి అకేష‌న్ కార‌ణంగా ఈ చిత్రానికి సంభందించిన పోస్ట‌ర్ ని విడుద‌ల చేశాము. అన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము.. అని అన్నారు.

షూటింగ్ కి శ్రీకారం చుట్టిన రుణం

గోపికృష్ణ , మహేంద్ర , శిల్ప , తేజు , ప్రియాంక హీరో హీరోయిన్ లుగా ఎస్ . గుండ్రెడ్డి దర్శకత్వంలో బెస్ట్ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై భీమనేని సురేష్ - జి . రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ''రుణం ''. పూజా కార్యక్రమాల అనంతరం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు . ఆ సందర్బంగా నిర్మాతలు భీమనేని సురేష్ , రామకృష్ణారావు లు మాట్లాడుతూ '' దర్శకులు గుండ్రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . రామోజీ ఫిలిం సిటీ లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సినిమా మొత్తం సింగిల్ షడ్యూల్ లో ప్లాన్ చేసాం . మానవీయ కోణానికి హాస్యాన్ని జోడించి చేస్తున్న సినిమా ఈ రుణం అన్నారు .      దర్శకుడు గుండ్రెడ్డి మాట్లాడుతూ '' కన్నడంలో నాలుగు సినిమాలకు , హిందీ లో ఒక సినిమాకు దర్శకత్వం వహించాను ఇప్పుడేమో ఈ రుణం చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నాను . మానవ సంబంధాల నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది , నన్ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్న నిర్మాతలకు రుణపడి ఉంటానన్నారు . రుణం చిత్రంతో హీరో, హీరోయిన్ లుగా పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు తెలిపారు హీరో హీరోయిన్ లు . ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఎస్వీ మల్లిక్ తేజ , సమర్పకులు గాలిరెడ్డి లు పాల్గొన్నారు .

రాహుల్ ర‌వీంద్ర‌న్ హౌరాబ్రిడ్జ్ టీజ‌ర్ కి అద్భుత స్పందన

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. చిత్రం టీజ‌ర్‌1 ని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ కి అనూహ్య‌మైన రెస్పాన్స్ రావ‌టంతో యూనిట్ స‌భ్యులంతా ఆనందంగా వున్నారు. ఇదే ఊపుతో దీపావ‌ళి శుభాకాంక్ష‌ల‌తో టీజ‌ర్2ని విడుదల చేశారు. విభిన్న‌ కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా న‌వంబ‌ర్ లో విడుదల‌కి సిధ్ధ‌మ‌వుతుంది.  త్వరలోనే ఆడియో లాంచ్ చేసి... రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.     ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ నే మా చిత్రం క‌థ‌. అదేంట‌నేది మీరు చిత్రం చూసాక‌నే అర్దం అవుతుంది.  ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు  రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. ఈ చిత్రానికి మేము విడుదల చేసి టీజ‌ర్‌1కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌డు దీపావ‌ళి కానుక‌గా టీజ‌ర్‌2ని విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహలు చేస్తున్నారు. నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రంగా నిలుస్తందనే నమ్మకం ఉంది. అని అన్నారు.    దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... బూచ‌మ్మ బూచొడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది.  ఈ చిత్రం మెద‌టి టీజ‌ర్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశాము. అయితే విడుదల చేసిన రోజు నుండి ప్ర‌తి చోటా మా టీజ‌ర్ గురించి మాట్లాడుకోవ‌టం చాలా ఆనందంగా వుంది. ప్రామీస్ చేయ్యటం అంటే రెండు చేతులతో క‌దా.. ఇలా కాదేమో.. ఇలానే బావుంది క‌దా అనే డైలాగ్ యూత్ కి విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. చాలా మంది సోష‌ల్ మీడియాలో డ‌బ్‌స్మాష్ లు చేయ‌టం మా చిత్ర క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఇప్ప‌డు దీపావ‌ళి సంద‌ర్బంగా మా రెండ‌వ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నాము. ఇది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి చేశాను. నాహీరో రాహుల్‌ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. మా హీరోయిన్స్ ఛాందిని చౌద‌రి, మ‌నాలి రాథోడ్ లు ఇద్ద‌రి పాత్ర‌లు చాలా ఇంపార్టెంట్ వున్న పాత్రలే . ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేస్తాం. రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాం. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది.  అని అన్నారు.  

న‌వంబ‌ర్ 10న కేరాఫ్ సూర్య విడుద‌ల

న‌గ‌రం, స‌మంత‌క‌మ‌ణి లాంటి చిత్రాల త‌రువాత సందీప్ కిషన్, మ‌హ‌నుభావుడు, రాజాదిగ్రేట్ చిత్రాల త‌రువాత హ్య‌ట్రిక్ క్వీన్‌ మెహ్రీన్ జంటగా , నా పేరు శివ లాంటి నేచుర‌ల్ హిట్ ని అందించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంక‌ర్‌ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో , స్వామిరారా, వీడుతేడా లాంటి మంచి చిత్రాల త‌రువాత‌  చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైల‌ర్, రెండు సాంగ్స్‌ తో ఈ సినిమాకు ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడింది. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యుఏ స‌ర్టిఫికేట్ తో ప్ర‌పంప‌చ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 10న విడుద‌ల కానుంది.   ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య చిత్ర టీజర్, రెండు సాంగ్స్ ని విడుద‌ల చేశాము. టీజ‌ర్ కి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కి కూడా ఆ రేంజి ప్ర‌శంశ‌లు రావ‌టం చాలా ఆనందంగా వుంది. అంతేకాకుండా ట్రేడ్ లో బిజినెస్ కూడా స్పీడ్ అందుకోవ‌టం విశేషం. మా టీజ‌ర్ ని విడుల చేసిన నాని గారికి, సాంగ్స్ విడుదల చేసిన ర‌కూల్ ప్రీత్ సింగ్‌, కాజ‌ల్ గారికి మా ధ‌న్య‌వాదాలు.  ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ప‌క్కింటి కుర్రాడుగా తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. టాలీవుడ్ ల‌క్కీ హీరోయిన్ మెహ్రిన్‌ కు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిక్‌ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నాం. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. త్వరలోనే ధియోట్రిక్ ట్రైల‌ర్ ని, ఆడియో ఫంక్ష‌న్ ని చేస్తున్నాం. ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.అని అన్నారు   సందీప్ కిషన్ మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య షూటింగ్ దశలోనే నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిన చిత్రం. అలాంటి చిత్ర టీజర్ ను నా బెస్ట్ ఫ్రెండ్స్ నాని, సాంగ్స్ ని ర‌కూల్‌, కాజ‌ల్ లు రిలీజ్ చేయడం అవి మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ద‌ర్శ‌కుడు  సుశీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శివ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా కొత్త అనుభూతినిచ్చింది. ప్రతీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నాను. ప్రతీ సీన్, ప్రతీ ఎమోషన్ ప్రతీ ఒక్కరినీ టచ్ చేస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మెహ్రీన్ సూపర్ యాక్ట్రెస్. ఆమెకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఇమ్మాన్ మ్యూజిక్ మరో లెవల్ కు తీసుకెళ్తుంది. చిత్రాన్ని న‌వంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్నారు. అని అన్నారు.

ఆసక్తి రేపుతున్న రాజుగాడు ఫ‌స్ట్‌లుక్

యువకథానాయకుడు రాజ్‌తరుణ్ న‌టిస్తోన్న డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజుగాడు`. వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న రాజ్ త‌రుణ్ ...త‌న‌కు వ‌రుస విజ‌యాల‌ను అందించిన నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై న‌టిస్తోన్న చిత్రం `రాజుగాడు`. రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌త‌రుణ్ చేస్తోన్ననాలుగో చిత్రమిది, సంజనా రెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా ద‌స్తుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఒక‌ప‌క్క ల‌వ‌ర్ అయిన అమైరా ద‌స్తుర్‌ను కౌగిలించుకుంటూనే ఆమె హ్యాండ్ బ్యాగ్ నుండి సెల్‌ఫోన్ కొట్టేయ‌డం ఈ ఫ‌స్ట్‌లుక్‌లో క‌న‌ప‌డుతుంది.   ఈ ఫ‌స్ట్‌లుక్ అస‌లు హీరో రాజ్‌త‌రుణ్ ఎలాంటి క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌నున్నాడోన‌ని ఆస‌క్తిని రేపుతుంది.  కామెడీ, లవ్‌, యాక్షన్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న ఎంటర్‌టైనర్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, రావు ర‌మేష్‌గారు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పుడు పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గుతుంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు. `రాజుగాడు` చిత్రంతో రాజ్‌త‌రుణ్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బేన‌ర్‌లో నాలుగో హిట్‌ను సాధించాల‌ని కోరుకుందాం. 

రవితేజ రాజా ది గ్రేట్ ఏ రేంజ్ హిట్ అని భావిస్తున్నారు ?

1) హిట్  2) సూపర్ హిట్  3) యావరేజ్  4) బ్లాక్ బస్టర్  5) తెలియదు  

మహేష్ ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పదు

మహేష్ బాబు అభిమానులకు ఎదురుచూపులు తప్పదు ఎందుకంటే ఇప్పట్లో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు ......... మహేష్ కొత్త సినిమా రావాలంటే ఆరు నెలల కాలం ఎదురు చూడాలి ఎందుకంటే కొరటాల శివ తో చేస్తున్న భరత్ అనే నేను చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో తెలుసా ........ ఏప్రిల్ 20న . ఇంకా అధికారికంగా ఈ డేట్ ని ప్రకటించాల్సి ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళు ఆలోచిస్తున్న డేట్ మాత్రం ఇదే .2018 ఏప్రిల్ 20 అంటే సరిగ్గా ఆరు నెలల కాలం కంటే ఎక్కువే సమయం ఉంది మరి .      భరత్ అనే నేను చిత్రాన్ని అసలు సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాల్సి ఉండే కానీ స్పైడర్ ఎఫెక్ట్ తో ఏప్రిల్ కు మారింది రిలీజ్ డేట్ . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తోంది . ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు . స్పైడర్ ఘోర పరాజయం పొందడంతో భరత్ అనే నేను పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాగా మహేష్ కూడా స్పైడర్ ఎఫెక్ట్ తో భరత్ అనే నేను పై మరింత జాగ్రత్త పడుతున్నాడట . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..