Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ సెన్సార్ పూర్తి

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరులో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.      ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు  రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలాఖరులో గ్రాండ్ రిలీజ్ తో మీ ముందుకు వస్తున్నాం.  నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అని అన్నారు.    దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. కథలో అనేక ట్విస్టులుంటాయి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశాం. సెన్సార్ సభ్యుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. సో... చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. డిసెంబర్ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తున్నాం.  అని అన్నారు.  

డిసెంబర్ 15న 'వెన్నెల' ఫేం జ‌య‌తి న‌టించిన 'ల‌చ్చి' గ్రాండ్ రిలీజ్

ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. హార్ర‌ర్ కామెడీ లో వైవిధ్యాన్ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు.  డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.    ఈ సంద‌ర్బంగా నిర్మాత‌, క‌థానాయిక జ‌య‌తి మాట్లాడుతూ... "చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో మెట్ట‌మెద‌టిసారిగా సినిమా నిర్మాణం చేపట్టాను. అలాగే ఈ చిత్రం క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్ లో న‌టించాను. హార్ర‌ర్ కామెడీ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ లచ్చి చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుంది. వైవిధ్యమైన కథ, కథనం ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తుంది.  ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. అనేక మలుపులు ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాయి. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ కడుపుబ్బా నవ్విస్తారు. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.ర‌ఘు గారితో ప‌నిచేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆయ‌న ఈచిత్రాన్ని మ‌రో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాట‌లు మరుదూరి రాజా గారు అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.  మా చిత్రాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాము.  అని అన్నారు.

మేనేజర్ పై ఆగ్రహంగా ఉన్న నితిన్

లై సినిమా ఘోర పరాజయం పొందటంతో నితిన్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు దానికి తోడు తన అసహనాన్ని తన మేనేజర్ వెంకట్ పై ప్రదర్శిస్తున్నాడట నితిన్ . ఎందుకంటే ఆ సినిమాని చేయమని చెప్పింది తన మేనేజర్ అని అలాగే సరైన సినిమాలు తన దృష్టి కి రాకుండా చూస్తున్నాడని సరైన స్క్రిప్ట్ లు తన దగ్గరకు రాకుండా చేస్తున్నాడని ఆగ్రహంగా ఉన్నాడట అందుకే కొత్త మేనేజర్ కోసం వెదుకుతున్నాడట నితిన్ . ఈ హీరో ఆగ్రహం బాగానే ఉంది కానీ మేనేజర్ ల పాత్ర నిమిత్త మాత్రం మాత్రమే ! ఎందుకంటే కథ లు ఉన్నాయని బోలెడు మంది వస్తుంటారు అందరినీ ఎంకరేజ్ చేస్తే హీరో విలువైన సమయం వృధా అవుతుంది దాంతో మేనేజర్ పైనే విసుగు పడతారు కాబట్టి ఫిల్టర్ చేయాల్సిందే . ఇక సినిమా చేసే ముందు అన్ని ఆలోచించుకున్నాకే హీరో ఓకే చేయాలి కానీ మేనేజర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏమొస్తుంది . ప్రస్తుతం నితిన్ రెండు , మూడు క్రేజ్ ఉన్న  ప్రాజెక్ట్ లను ఎంచుకున్నాడు మరి అవి ఏమౌతాయో చూడాలి . 

దిల్ రాజుని భయపెట్టిన చరణ్ నిర్మాతలు

అగ్ర నిర్మాత, పంపిణీదారుడు అయిన  దిల్ రాజు ని భయపెట్టారు చరణ్ నిర్మాతలు . అగ్ర నిర్మాత దిల్ రాజు ని చరణ్ నిర్మాతలు భయపెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం రంగస్థలం పై క్రేజ్ ఏర్పడటంతో ఆ చిత్రాన్ని నైజాం లో రిలీజ్ చేయాలనీ ముందుకు వచ్చాడు దిల్ రాజు . అయితే ఆ సినిమా హక్కుల కోసం మైత్రి మూవీస్ చెప్పిన రేటు చూసి షాక్ అయ్యాడట ! రంగస్థలం కేవలం నైజాం హక్కుల కోసం 20 కోట్లు చెల్లించాలని చెప్పారట ...... ఆ రేటు విన్న వెంటనే దిల్ రాజు షాక్ అయిపోయి మిన్నకుండి పోయాడట ! దిల్ రాజు సైలెంట్ కావడంతో ప్రభాస్ నిర్మాతలు యువి క్రియేషన్స్ ముందుకు వచ్చి 18 కోట్ల కు బేరం కుదుర్చుకొని రంగస్థలం నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు . చరణ్ సినిమాకు ఒక్క నైజాం రేటు 18 కోట్లు అంటే చాలా ఎక్కువ అయినప్పటికీ ప్రభాస్ నిర్మాతలు ధైర్యం చేసి నైజాం పంపిణీ రంగంలో అడుగుపెడుతున్నారు . రంగస్థలం తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు . ఇప్పటికే చరణ్ లుక్ సరికొత్త సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . 

నాని ఎం సి ఏ ట్రైలర్ ఎలా ఉంది ?

1)బాగుంది 2) చాలా బాగుంది 3) యావరేజ్ గా ఉంది 4) బాగోలేదు 5) సినిమా చూడాలన్న ఆసక్తి రేపింది  

అసలేం జరుగుతోంది

ఈరోజు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు కావడంతో హారిక అండ్ హాసిని సంస్థ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేయడమే కాకుండా ఆ సినిమాకు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని కూడా ప్రకటించింది దాంతో అయోమయం నెలకొంది ఎందుకంటే ఇదే సంస్థ ఎన్టీఆర్ తో ఒక సినిమాని ఆమధ్య ప్రారంభించింది దానికి దర్శకుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడంతో ఈ అయోమయం నెలకొంది . ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అయ్యింది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరగడం లేదు . ప్రస్తుతం త్రివిక్రమ్ అజ్ఞాత వాసి చిత్రం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తో అది పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . అయితే త్రివిక్రమ్ మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ సడెన్ గా సీనియర్ హీరో వెంకటేష్ లైన్ లోకి రావడంతో ఎన్టీఆర్ సినిమా ఉందా ? లేదా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . త్రివిక్రమ్ చినబాబు తో బాగానే టై అప్ అయ్యాడు అందుకే వరుసగా అతడికే సినిమాలు చేస్తున్నాడు . 

అబ్బబ్బా .... బూతులు బూతులు

ఒకరేమో ప్రజాప్రతినిధి పైగా మహిళానేత , మరొకరు నిర్మాత , నటుడు కూడా కానీ ఈ ఇద్దరూ కలిసి బూతులు తిట్టుకుంటూ సదరు టివి ఛానల్ వాళ్లకు పండగ చేసారు , సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది . ఓ టివి ఛానల్ లైవ్ కార్యక్రమంలో ఇదంతా జరగడం సంచలనం సృష్టిస్తోంది . ఇంతకీ బూతులు తిట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసా ....... ఎవరి గురించో తెలుసా ...... తిట్టుకున్న వాళ్ళు రోజా , బండ్ల గణేష్ లైతే పవన్ కళ్యాణ్ కు బండ్ల సపోర్ట్ చేయగా జగన్ తరుపున వకాల్తా పుచ్చుకుంది రోజా . బండ్ల గణేష్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ భక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే , ఇక రోజా వైసిపి లో ఫైర్ బ్రాండ్ దాంతో వారసత్వ రాజకీయాలపై చర్చ లో పాల్గొని తిట్టుకున్నారు . ఇంకేముంది ఈ ఇద్దరూ గొడవ పడుతుంటే సదరు ఛానల్ వాళ్ళు పండగ చేసుకున్నారు . అగ్గి రాజేయడం ఆనందం పొందడం వాళ్ళ పని అందుకే ఉత్సాహపడ్డారు . మొత్తానికి రోజా తిట్ల పురాణంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది . 

'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' సక్సెస్‌ టూర్‌

సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రతం సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.    ఈ సందర్భంగా నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ ''మా బేనర్‌లో సప్తగిరితో చేసిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రాన్ని ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేశారు. ఇప్పుడు 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రానికి కూడా ఘనవిజయాన్ని అందించారు. ఇంతటి విజయాన్ని మాకు ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పేందుకు డిసెంబర్‌ 14 గురువారం నుంచి సక్సెస్‌ టూర్‌ని ప్లాన్‌ చేశాం.  గురువారం : వైజాగ్‌, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు  శుక్రవారం : విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్స్‌ని సందర్శిస్తాము. ఈ టూర్‌ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో టూర్‌ని ప్లాన్‌ చేస్తాం'' అన్నారు. 

పాపం .... అది కూడా డిజాస్టర్ అయింది

హీరో గోపీచంద్ కు అసలు టైం బాగా లేనట్లుంది. గతకొంత కాలంగా గోపీచంద్ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. లౌక్యం సినిమా హిట్ తర్వాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆక్సిజన్ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే టాక్ కాస్త బాగానే వచ్చినప్పటి కీ సినిమాకు కలెక్షన్లు మాత్రం లేకుండాపోయాయి. పది రోజుల లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ రాబట్టిందో తెలుసా ......   నాలుగున్నర కోట్లు మాత్రమే. అంటే సినిమా బడ్జెట్ లో ఒక వంతు కూడా వసూల్ చేయలేకపోయింది. అసలే ఆక్సిజన్ సినిమా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ మరింత పెరిగింది, కానీ ఆ స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది. ఏ ఎం రత్నం తనయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఆక్సిజన్ గోపీచంద్ కు కానీ ఏ ఎం రత్నం కు కానీ ఆక్సిజన్ అందించలేకపోయింది.

రెగ్యులర్‌ షూటింగ్‌లో సాయిధరమ్‌తేజ్‌, కరుణాకరన్‌, కె.ఎస్‌.రామరావు చిత్రం

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్‌ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించిన సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌.. సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఐ.ఎం.టి. కాలేజీలో ప్రారంభమైంది.    ఈ సందర్భంగా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామరావు మాట్లాడుతూ ''మా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఇది 45వ సినిమా. ఈరోజు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం. కంటిన్యూగా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌గారితో మా బేనర్‌లో రెండో సినిమా చేస్తున్నాం. మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌కి మా బేనర్‌లో ఇది రెండో సినిమా. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.    దర్శకుడు ఎ.కరుణాకరన్‌ మాట్లాడుతూ - ''ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ కలిసిన యూత్‌ఫుల్‌ కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ఇది'' అన్నారు.    సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌, సురేఖావాణి, వైవా హర్ష, జోష్‌ రవి, ఐశ్వర్య, రాజా, భరత్‌రెడ్డి, కార్తీక్‌, అభిషేక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఆర్ట్‌: సాయిసురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, పాటలు: సాహితి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, పోతుల రవికిరణ్‌, మాటలు: 'డార్లింగ్‌' స్వామి, స్టిల్స్‌: వెంకట్‌ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీష్‌ కొప్పినీడి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వి.మోహన్‌, కో-ప్రొడ్యూసర్‌: కె.ఎ.వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..