Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

రోడ్ షోలో డబ్బులు పంచిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో ఇరుక్కున్నారు . తాజాగా నంద్యాల ఉప ఎన్నిక కోసం నంద్యాల వెళ్లిన బాలయ్య రోడ్ షోలోనే డబ్బులు పంచుతూ అడ్డంగా మీడియా కి దొరికాడు . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే ఓ అభిమాని చెంప పగులగొట్టి తెలుగుదేశం నాయకుల గుండెల్లో గుబులు రేపిన బాలయ్య తాజాగా డబ్బులు పంచుతూ మీడియా కి దొరకడం తో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయం పై ద్రుష్టి పెట్టడం ఖాయమని అంటున్నారు.బాలయ్య డబ్బులు పంచుతున్న ఫోటోలు , వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఒకవైపు మంత్రి అఖిల ప్రియా మాట్లాడుతుండగా బాలయ్య ఇలా డబ్బులు పంచాడు . నంద్యాల ఉప ఎన్నికని అధికార తెలుగుదేశం , ప్రతిపక్ష వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . దాంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ

ఆనందో బ్ర‌హ్మ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఢిల్లీబ్యూటీ తాప్సీ పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నారు. తాజాగా లోనావ‌ల లో ఉన్న బిగ్ బాస్ హౌస్ ని సంద‌ర్శించిన తాప్సీ అక్క‌డ ఉన్న పార్టిస్పెంట్స్ తో క‌లిసి సందడి చేశార‌ని ఆనందో బ్ర‌హ్మ నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి తెలిపారు. ఆగస్ట్ 18న కామెడీ హార‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఆనందో బ్రహ్మ విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా కథకి తగ్గట్లుగా ఓ డిఫరెంట్ గెటెప్ తో తాప్సీ బిగ్ బాస్ హౌస్ ని సందర్శించినట్లుగా చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. స్టార్ మా ఛాన‌ల్ వారు నిర్వ‌హిస్తున్న‌ ఈ షోలో తాప్సీ పాల్గొన్న ఎపిసోడ్ ఆగస్ట్ 17 రాత్రి తొమ్మిదిన్న‌రికి ప్ర‌సారం అవుతుంది. జూనియ‌ర్ య‌న్టీఆర్ ఈ షోని హొస్ట్ చేస్తున్నారు. ఇక తాప్సీ మెయిన్ లీడ్ గా స్టార్ క‌మీడియ‌న్లు వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్, తాగుబోతు ర‌మేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పాఠ‌శాల ఫేమ్ మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. సినిమాటోగ్రాఫ‌ర్ : అనీష్ త‌రుణ్ కుమార్, మ్యూజిక్ :  కే.

సెన్సార్ బోర్డు తో యుద్ధం తప్పదట

సెన్సార్ బోర్డు తీరుతో యుద్ధం తప్పదని అంటున్నారు '' కాలా కాండీ '' చిత్ర యూనిట్ . సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు  సినిమాని సెన్సార్ కు పంపించగా ఏకంగా 73 కట్స్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . సినిమాలో ఎక్కువగా బూతు పదాలు ఉన్నాయని సెన్సార్ వాళ్ళు 73 కట్స్ ఇవ్వడంతో షాక్ కి గురైన చిత్ర బృందం కాలా కాండీ చిత్ర విడుదల ని వాయిదా వేశారు.సైఫ్ అలీఖాన్ సరికొత్త గెటప్ లో కనిపించనున్న ఈ చిత్రానికి అక్షత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు . సెన్సార్ వాళ్ళు 73 కట్స్ ఇవ్వడంతో సెన్సారు వాళ్లపై పోరాటానికి సిద్ధం అవుతున్నారు . మా సినిమాలో అభ్యంతరకరమైన సీన్స్ ఏవి లేవని , పోరాటమే మా మాముందున్న మార్గమని అంటున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు . మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

తమిళ్ లో భారీ విజయం దిశగా విఐపి 2

ధనుష్ హీరోగా నటించిన వి ఐ పి 2 గత శుక్రవారం రిలీజ్ అయి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది . తొలి వీకెండ్ లో ఏకంగా 45 కోట్ల కు పైగా వసూళ్ల ని సాధించింది . తెలుగు , తమిళ , హిందీ లలో ఏకకాలంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ బిజినెస్ పరంగా అనుకున్న విధంగా సేల్స్ కాకపోవడంతో మొదట తమిళంలో రిలీజ్ చేసారు . తమిళంలో రివ్యూలు యావరేజ్ గా వచ్చాయి కానీ వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి దాంతో హిందీ , తెలుగులలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ధనుష్ - అమలా పాల్ జంటగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ భామ కాజోల్ నటించింది . ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ధనుష్ మరదలు సౌందర్య రజనీకాంత్ . వి ఐ పి సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది . మొదటి వీకెండ్ లోనే 50 కోట్ల వైపు దూసుకెళుతూ భారీ విజయం సాధించేలా ఉంది.

ఎన్టీఆర్ సెకండ్ హ్యాట్రిక్ కొడతాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాడు . టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాలు వరుస విజయాలు సాధించాయి . హ్యాట్రిక్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ పై ఎన్టీఆర్  పడింది దృష్టి . మరి ఎన్టీఆర్ సెకండ్ హ్యాట్రిక్ శ్రీకారం చుడతాడా చూడాలి . తాజాగా జై లవకుశ చిత్రం చేస్తున్నాడు ఎన్టీఆర్ , ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్.జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి , జై టీజర్ అందరినీ కట్టిపడేస్తుండగా తాజాగా లవ కుమార్ టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . జై లవకుశ హిట్ అయితే సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టినట్లే !

హీరోయిన్ నగ్న ఫోటోలు లీక్

హాలీవుడ్ హీరోయిన్ , సింగర్ అయిన అన్నా హాతావే  నగ్న ఫోటోలు లీక్ కావడం సంచలనం సృష్టించింది . ఈమధ్య వరుసగా పలువురు హీరోయిన్ ల నగ్న ఫోటోలు లీక్ అవుతూ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . సూచీలీక్స్ పేరుతో గతంలో పలువురు నటీనటుల వీడియో లు , నగ్న చిత్రాలు లీక అయి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అయితే తాజాగా అన్నా హతావే  నగ్న ఫోటోలు ఎక్కడి నుండి లీక్ అయ్యాయో తెలుసా ....... ఆమె ఎకౌంట్ నుండే !   అన్నా హతావే  అకౌంట్ నుండి నగ్న చిత్రాలు లీక్ కావడంతో షాక్ కి గురయ్యింది అన్నా ....... ! అయితే అన్నా హతావే  నగ్న ఫోటోలు లీక్ కావడానికి సైబర్ ఎటాక్ అయి ఉంటుందని లేదంటే మరింతగా ప్రచారం కోసం ఆ భామే చేసి ఉండొచ్చు అని గుసగుసలు వినిపిస్తున్నాయి . 

రజనీకాంత్ మెచ్చిన తారామణి

సూపర్ స్టార్ రజనీకాంత్ తారామణి చిత్ర బృందాన్ని అభినందించాడు . ఆగస్టు 11న రిలీజ్ అయిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి . తమిళనాట మంచి వసూళ్ల ని సాధిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా రజనీకాంత్ చూసాడు . సినిమా తనకు బాగా నచ్చడంతో వెంటనే ఆ చిత్ర యూనిట్ కు కబురు అందించి ఇంటికి పిలిపించుకున్నాడు . తారామణి అద్భుతంగా ఉందని దర్శక నిర్మాతలను నటీనటులను అభినందనలతో ముంచెత్తాడట రజనీకాంత్ .   సూపర్ స్టార్ రజనీకాంత్ తారామణి చిత్ర బృందాన్ని అభినందించడంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . ఒకవైపు ప్రేక్షకుల ఆదరణ మరోవైపు విమర్శకుల ప్రశంసలు వీటితో పాటు రజనీ ప్రశంసలు దక్కడంతో సంతోషంగా ఉన్నారు . ఇక ఈ సినిమాని తెలుగులో యువ నిర్మాత డి . వెంకటేష్ అందిస్తున్నారు . తమిళంలో మంచి హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ కావడం ఖాయమని నమ్మకంగా ఉన్నాడు వెంకటేష్ . 

అభిమాని చెంప పగులగొట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ మరోసారి ఆవేశానికి లోనయ్యాడు , అభిమానం తో బాలయ్య దగ్గరకు వచ్చిన ఓ అభిమాని చెంప పగులగొట్టి వివాదంలోకి ఎక్కాడు . గతంలో పలుమార్లు బాలయ్య ఆవేశానికి లోనవడం అభిమానులను బూతులు తిట్టడం , కొట్టడం చేసాడు . తాజాగా నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన బాలయ్య ఓ లాడ్జి దగ్గరకు బస చేయడానికి వెళ్లిన సమయంలో ఓ అభిమాని బాలయ్య కు దందడ వేయాలని ఉత్సాహపడ్డాడు అంతే బాలయ్య కు ఎక్కడా లేని కోపం వచ్చింది .     వెంటనే అతడ్ని కొట్టాడు బాలయ్య . అయితే బాలయ్య కొట్టిన సమయంలో ఎవరో వీడియో తీసి దాన్ని నెట్ లో పోస్ట్ చేసారు ఇప్పుడు ఆ వీడియో నెట్ లో సంచలనం సృష్టిస్తోంది . నంద్యాల ఉప ఎన్నికల వేళ బాలయ్య ఇలా కొట్టడం తెలుగుదేశం వర్గాల్లో ఆందోళన నెలకొంది .

అగ‌ష్టు 24న‌ శ‌ర్వానంద్‌ "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కి కేరాఫ్ గా మారిన శ‌ర్వానంద్ హీరోగా,  ఒక్క చిత్రంతోనే యూత్ హ‌ర్ట్‌బీట్ గా మారిన మెహ‌రిన్ హీరోయిన్ గా, క్రేజి ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రానికి మ‌హ‌నుభావుడు అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. ఓక్క సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈరోజు నుండి డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామెజిఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. అగ‌ష్టు 24న ఈ చిత్రానికి సంభందించి మెద‌టి లుక్ అండ్ మెద‌టి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది.  ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ..  ర‌న్ రాజా ర‌న్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల త‌రువాత శ‌ర్వానంద్ హీరోగా చేస్తున్న మూడ‌వ చిత్రం మ‌హ‌నుభావుడు. మారుతి చెప్పిన కేర‌క్ట‌రైజేష‌న్ దాని నుండి వ‌చ్చిన కామెడి చాలా బాగా న‌చ్చి వెంట‌నే చిత్రాన్ని తెర‌కెక్కించాము. ఓక్క సాంగ్ మిన‌హ  షూటింగ్ పూర్త‌యింది. ఈరోజు నుండి డ‌బ్బింగ్ కార్క‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాము. విదేశాల్లో, ఇండియాలో ని ప‌లు ప్ర‌దేశాల్లో చిత్రాన్ని షూట్ చేశాము. అగ‌ష్టు 24న ఈ చిత్రం మెద‌టి లుక్ ని , టీజ‌ర్ ని విడుద‌ల చేస్తాము. శ‌ర్వానంద్ కి మాబ్యాన‌ర్ లో మ‌రో మంచి చిత్రంగా మ‌హ‌నుభావుడు నిలుస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని  అన్నారు. ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం త‌రువాత నాకు బాగా న‌చ్చిన కేర‌క్ట‌రైజేష‌న్ తొ చేస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు. అన్ని ప‌క్కాగా అనుకున్న‌త‌రువాత ఈ చిత్రం సెట్ మీద‌కి వెళ్ళాము. శ‌ర్వానంద్ కెరీర్ లో ఈ చిత్రం బెస్ట్ చిత్రం గా నిలుస్తుంద‌ని నమ్మ‌కం వుంది.  శ‌ర్వానంద్ చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడి వుంటుంది. థ‌మ‌న్ సూప‌ర్  ఆడియో అందించాడు. మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా  ఈ చిత్రం వుంటుంది. అగ‌ష్టు 24న ఈచిత్రం మెద‌టి లుక్ ని రివీల్ చేస్తున్నాము. ద‌స‌రా కి విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. అని అన్నారు.  న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు.. సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ ష‌ఫి, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- మారుతి.

పవన్ పై ఆగ్రహంగా ఉన్న టిడిపి

పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ఇస్తాడని అందరూ ఊహించారు కానీ నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ నేను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పడంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర షాక్ కి గురయ్యింది . ఇన్నాళ్లు తెలుగుదేశానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్దతు ఇవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు అని భావిస్తున్నారు . పవన్ కు ప్రత్యేకంగా కార్యకర్తలు , నాయకులు అంటూ ఎవరూ లేరు కానీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు ఎటు వెళతాయో అన్న మీమాంస లో ఉన్నారు .   అయితే పవన్ మద్దతు లేదని తేల్చి చెప్పడంతో కొంతమంది తెలుగుదేశం నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పవన్ మద్దతు ఇస్తే ఎంత ? ఇవ్వకపోతే ఎంత ? అసలు పవన్ కు కార్యకర్తలే లేరు అతడు మద్దతు ఇవ్వడం వల్ల ఒనగూడే ప్రయోజనం కూడా ఏమిలేదు అంటూ పవన్ పై నిప్పులు చెరుగుతున్నారు తెలుగుదేశం నాయకులు . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..