Home Topstories
TOLLYWOOD
 TOP STORIES

13 మంది హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన సినిమానట

హీరోయిన్ ని రేప్ చేసే సినిమా ఏంటి ? ఇది వల్గర్ సినిమానే అని ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది హీరోయిన్ లు ''దేవిశ్రీ ప్రసాద్ '' అనే సినిమాలో నటించడానికి నిరాకరించారట ! ఈ విషయాన్ని ధన్ రాజ్ తాజాగా వెల్లడించాడు . అయితే 13 మంది హీరోయిన్ లు రిజెక్ట్ చేసిన పాత్ర ని తమిళ నటి పూజా రామచంద్రన్ ఒప్పుకోవడమే కాకుండా  ఛాలెంజ్ గా తీసుకొని నటించి ఇప్పుడు అందరి చూపు తనపై ఉండేలా చేసుకుంది . పూజా రామచంద్రన్ అనే భామ తమిళ చిత్రాల్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది కానీ అవేవీ అంతగా ఆడలేదు . ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ ఈ భామకు అంతగా పేరు రాలేదు .        శ్రీ కిషోర్ చెప్పిన పాత్ర ఛాలెంజింగ్ గా ఉండటంతో తప్పకుండా తన కెరీర్ కు దేవిశ్రీ ప్రసాద్ బ్రేక్ నివ్వడం ఖాయమని నమ్ముతోంది పూజా రామచంద్రన్ . ధన్ రాజ్ , మనోజ్ నందం , భూపాల్ లు కీలక పాత్ర ల్లో నటించిన దేవిశ్రీ ప్రసాద్ ఈనెల 17న రిలీజ్ అవుతోంది . సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం , అలాగే పూజా రామచంద్రన్ కూడా . 

చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడట

సైరా ..... నరసింహారెడ్డి చిత్రం ఎప్పుడో ఆగస్ట్ లో ప్రారంభం అయ్యింది కానీ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు , నవంబర్ నెల కూడా సగం అయిపొయింది కానీ సైరా షూటింగ్ ఎప్పుడో ఇదమిద్దంగా తెలియడం లేదు అందుకు కారణం ఏంటో తెలుసా  ..... ..... స్క్రిప్ట్ వర్క్ లో నెలకొన్న గందరగోలమే ! అసలు నరసింహారెడ్డి కథ ని పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో రాసారు చిరంజీవి సూచనల మేరకు స్వల్ప మార్పులు చేసారు కూడా కానీ ఇప్పుడు రైటర్ గా వెలుగులోకి వచ్చిన రచయిత బుర్రా సాయి మాధవ్ దాంతో అతడ్ని కూడా తీసుకొచ్చి స్క్రిప్ట్ లో కూర్చోబెట్తారట అక్కడే తేడా కొట్టింది .        పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే ఒకలా ఉంటే సాయి మాధవ్ బుర్రా స్క్రీన్ ప్లే మరోలా ఉంది దాంతో దర్శకుడు సురేందర్ రెడ్డి కి పరుచూరి బ్రదర్స్ కు తేడా లు వచ్చాయి ఇంకేముంది ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి వరకు వెళ్ళడంతో అందరికీ క్లాస్ పీకాడట అంతేకాదు వారం , పది రోజుల్లో అసలు విషయం చెప్పమని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట. దాంతో చేసేది లేక అందరూ ఒకే స్క్రిప్ట్ కి పదును పెట్టె పనిలో ఉన్నారట ! ఇది ఓ కొలిక్కి వస్తే డిసెంబర్ నెలాఖరు లో సెట్స్ మీదకు వెలుతుందేమో .

బిచ్చగాడు హీరోకు భలే డిమాండ్

బిచ్చగాడు చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన హీరో విజయ్ ఆంటోనీ కి ఆ సినిమా తర్వాత భలే డిమాండ్ ఏర్పడింది . తాజాగా సీనియర్ హీరోయిన్ రాధికా తో కలిసి '' ఇంద్రసేన '' చిత్రాన్ని నిర్మించాడు కాగా ఆ సినిమా ఈనెల 30న రిలీజ్ కి సిద్ధమైంది అయితే నీలం కృష్ణారెడ్డి అనే నిర్మాత ఏకంగా రెండున్నర కోట్లు చెల్లించి థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు . బిచ్చగాడు హీరోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది పెద్ద మొత్తం కాదు కానీ విజయ్ ఆంటోనీ కి డబ్బుల కన్నా తన మార్కెట్ ని పెంచుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంది అతడికి .        అందుకే రెండున్నర కోట్ల కు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ హక్కులను అమ్మేశాడు అయితే ఓ మెలిక పెట్టాడట ! పబ్లిసిటీ మాత్రం ఎక్కడా తగ్గొద్దు అని ఖచ్చితంగా చెప్పాడట విజయ్ ఆంటోనీ . ఈనెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి , సినిమా హిట్ అయితే విజయ్ ఆంటోనీ కి స్థిరమైన మార్కెట్ ఏర్పడటం ఖాయం . ఇప్పటికే బేతాళుడు , యమన్  చిత్రాలతో తన సత్తా చాటాడు ఇక ఇప్పుడు ఇంద్రసేన అంటూ వస్తున్నాడు . 

విజయేంద్ర ప్రసాద్ మరొకరిని ముంచడానికి రెడీ అయ్యాడు

కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఎందుకంటే అజరామరమైన , అనిర్వచనీయమైన విజయాలను అందుకున్నాడు రచయితగా కానీ దర్శకుడిగా మారిన ప్రతీసారి ఘోరంగా దెబ్బ తింటూనే ఉన్నాడు . ఇప్పటికే రాజన్న సినిమా చేసాడు అది కాస్త బెటర్ అంతేకాని పెద్దగా హిట్ కాలేదు , దాని తర్వాత తన శిష్యుడు దర్శకత్వంలో సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని చేసి పెడతాను నన్ను నమ్ము అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో రూపొందించిన '' జాగ్వార్ '' ఘోర పరాజయం పొందింది దాని వల్ల భారీ నష్టాలు వచ్చాయి .        ఇక ఇటీవలే శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాకు దర్శకత్వం వహించాడు విజయేంద్ర ప్రసాద్ . ఆ సినిమా ముక్కీ మూలుగుతూ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది పరమ చెత్త సినిమాగా తేల్చి పడేసారు ప్రేక్షకులు దాంతో ఆ సినిమాని ఎన్నో ఆశలు పెట్టుకొని నిర్మించిన వాళ్ళు ఘోరంగా నష్టపోయారు . ఇక ఇప్పుడేమో మళ్ళీ మెగా ఫోన్ చేతబట్టడానికి రెడీ అయ్యాడు విజయేంద్ర ప్రసాద్ . ఇక ఇప్పుడేమో సునీల్ హీరో , ఇప్పటికే సునీల్ కెరీర్ స్లంప్ లో ఉంది డైరెక్టర్ గా విజయేంద్ర ప్రసాద్ ఇంకా ఘోర పరాజయాల్లో ఉన్నాడు మరి ఈ ఇద్దరూ కలిసి ముంచేది ఎవరినో . 

40 కోట్ల రెమ్యునరేషనా పవన్ కళ్యాణ్ కు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంట పండుతోంది , జనసేన పుణ్యమా అని పవన్ కళ్యాణ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . 2019 లో శాసనసభ కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి లో రాజకీయాల పై దృష్టి పెట్టడానికి సమాయత్తం అవుతున్నాడు అయితే పవన్ కళ్యాణ్ తెలుగునాట తిరుగులేని స్టార్ హీరో కాబట్టి అతడితో సినిమాలు చేయాలనీ పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం అంతటి సమయం లేదు కాబట్టి సినిమాలకు గుడ్ బై చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాడట.దాంతో  సినిమా చేయండి కావాలంటే సినిమాకు 40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని స్పష్టం చేశారట మైత్రి మూవీస్ సంస్థ . నలభై కోట్ల రెమ్యునరేషన్ అంటే మాటలు కాదు దక్షిణాదిన మాత్రమే కాదు భారత్ మొత్తంలో ఇంతటి సొమ్ము తీసుకుంటున్న హీరో ఒక్క రజనీకాంత్ మాత్రమే ! మిగతా హీరోలకు ఆ స్థాయి రెమ్యునరేషన్ లేదు కానీ పవన్ కళ్యాణ్ కు అంతటి సొమ్ము ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే పవన్ ఓకే చెబుతాడేమో చూడాలి ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు కావాలి కదా మరి.

ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసట ఈ హీరోకు

తమిళ హీరో కార్తీ మణిరత్నం దర్శకత్వంలో చెలియా చిత్రంలో నటించాడు .  ఆ సినిమా ఘోర పరాజయం పొందింది , అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని కథ విన్నప్పుడే నాకు తెలుసనీ సంచలన వ్యాఖ్యలు చేసాడు కార్తి . సినిమా ఫ్లాప్ అవుతుందని కథ విన్నప్పుడే తెలిసినప్పటికీ ఎందుకు ఆ సినిమాలో నటించాడో తెలుసా ....... మణిరత్నం లెజెండ్ డైరెక్టర్ ఆయన సినిమాలో నటించే చాన్స్ కోసం పలువురు హీరోలు పోటీ పడుతుంటారు కానీ అందరికీ ఆ చాన్స్ దొరకదు అందుకు దొరికిన చాన్స్ ని వినియోగించుకున్నాడు కార్తీ.పైగా మణిరత్నం దర్శకత్వంలో నటించడం అంటే నటనలో మరిన్ని మెలుకువలు నేర్చుకోవచ్చు అందుకే కార్తీ చెలియా చిత్రంలో నటించానని చెప్పుకొస్తున్నాడు కార్తీ . ఇక తాజాగా ఈ హీరో నటించిన చిత్రం '' ఖాకీ '' ఈనెల 17 న రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు . రియలిస్టిక్ అప్రోచ్ తో ఖాకీ సినిమా రూపొందిందని తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నాడు కార్తీ.

హీరో నాగార్జున స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం

హీరో అక్కినేని నాగార్జున సొంత స్టూడియో అయిన అన్నపూర్ణ స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది , అన్నపూర్ణ స్టూడియోస్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు సెట్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి . దాంతో భారీ ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది అయితే అది ఏ స్థాయి నష్టం అన్నది తేలాల్సి ఉంది . అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం అని తెలియగానే హుటా హుటిన సుప్రియ , అలాగే నాగార్జున స్టూడియో కు చేరుకున్నారు.ఈరోజు సాయంత్రం అయిదున్నర , ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టూడియో లో ఉన్న వాళ్ళని వెంటనే అప్రమత్తం చేసి బయటకు పంపించారు . అయితే సకాలంలో ఫైరింజన్ లు రాకపోవడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి . అయిదు ఫైరింజన్ లు వచ్చి నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి . ఇక నష్టం ఏమిటన్నది తేలాలి . అయితే ఈ భారీ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రంతో..ధ‌న‌రాజ్ ఏ పాత్ర అయినా బాగా చేస్తాడ‌నే మంచి పేరొస్తుంది - ధ‌న‌రాజ్‌

యశ్వంత్ మూవీస్ సమర్పణలో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్నచిత్రం `దేవిశ్రీప్రసాద్`. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మ‌నోజ్ నందం ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు. ఈ సినిమా నవంబర్  17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ..ధనరాజ్ మాట్లాడుతూ ‘‘ఈ సి నిమాలో హీరోయిన్ పూజా రామచంద్రన్ మెయిన్ రోల్ చేసింది. నేను,  భూపాల్, మనోజ్ నందం..ముగ్గురం ప్రధాన పాత్రల్లో నటించాం. దేవి అనే  పాత్రలో భూపాల్, ప్రసాద్ పాత్రలో మనోజ్ నందం నటిస్తే, నేను శ్రీ అనే పా త్రలో కనపడతాను. పూజా రామచంద్రన్ కంటే ముందు దాదాపు పదమూడు మంది హీరోయిన్స్‌ను కలిసి కథ చెబితే..వాళ్లు నటించమని  చెప్పేశారు. కానీ పూజా రామచంద్రన్‌కథ వినగానే యాక్ట్ చేయడానికి అం గీకరించింది. సినిమాలో పూజా రామచంద్రన్ పేరు లీలా రామచంద్రన్. తను  ఇందులో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సినిమా అంతా ఆరు  క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది.  ఈ మధ్య సినిమా ప్రీమియర్ చూసిన  తరుణ్, ప్రిన్స్ తదితరులు సినిమాను వ్యక్తిగతంగా ప్రమోట్ చేస్తామని చె ప్పారు. సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో చేశాం. నా క్యాఎక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. నాది మార్చురీ వ్యాన్ డ్రైవ‌ర్‌గా క‌న‌ప‌డ‌తాను. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన వారందరూ ఇదొక వల్గర్ సినిమా,  శవాన్ని రేప్ చేయడం ఏంటి? అని అన్నారు. కానీ సినిమా చూస్తే వల్గారిటీ  ఎక్కడా కనపడదు. ఇది యూత్ సినిమాయే.. కానీ బూతు సినిమా కాదు.  దర్శకుడు శ్రీకిషోర్ చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాడు. త‌ను లేకుండా ఈ సినిమాను ఊహించ‌లేం. సినిమాను 15-20 రోజుల్లో పర్‌ఫెక్ట్ ప్లానిం గ్‌తో తెరకెక్కించేశాడు. ఎనభై శాతం సినిమా మార్చురీ గదిలోనే షూట్ చేశారు. ముందు వేర్వేరు టైటిల్స్ అనుకున్ననప్పటికీ..చివరకు దేవిశ్రీ ప్రసాద్  టైటిల్ అయితే బావుంటుందని దాన్నే పెట్టాం. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ  ప్రసాద్‌గారి పేరు పెట్టుకున్న తర్వాత మా సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.  అలాగని మేమెక్కడా ఆయన పేరుని మిస్ యూజ్ చేయలేదు. ఈ శుక్రవారం  నేను నటించిన ‘లండన్ బాబులు’, ‘దేవిశ్రీప్రసాద్’ సినిమాలు విడ ుదలవుతున్నాయి. లండన్ బాబులు చిత్రంలో నాది ఎమోషనల్ పాత్ర.  అలాగే..దేవిశ్రీ ప్రసాద్ చిత్రం చూస్తే, ధనరాజ్ ఏ పాత్ర అయినా చేస్తాడని  పేరొస్తుంది’’ అన్నారు.

విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మి నిలయం చిత్రం ప్రారంభం

విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మణ్ కంచరి  దర్శకనిర్మాతగా గౌతమి, శిరీష్ ముఖ్యతారాగణం తో  నిర్మిస్తున్న చిత్రం లక్ష్మి నిలయం . ఈ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ముహూర్తం షాట్ కి క్లాప్ ఇచ్చి శుభారంభం పలికారు. దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి తండ్రిగారు ఈశ్వరయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా తన సోదరుడు  వెంకటేష్ తొలిషాట్ డైరెక్షన్ చేసారు.అనంతరం పాత్రికేయుల సమావేశం లో దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి మాట్లాడుతూ "ఇది ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కథ. సమాజం లో మహిళపై వేధింపులు ఎలా ఉన్నాయి వాటిని మహిళలు ఎలా ఎదురుకోవాలి , షీ టీమ్ ని ఎలా సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కథాంశం తో నిర్ణిస్తున్న చిత్రం ఇది . డిసెంబర్ రెండో వరం లో చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ మరియు మెదక్ పరిసరప్రాంతాలలో రెగ్యులర్  షూటింగ్ జరుగుతుంది.  ఫిబ్రవరి లో షూటింగ్ పూర్తిచేసుకొని ఏప్రిల్ లో చిత్రం విడుదల కి సన్నాహాలు చేస్తున్నాం .

శాటిలైట్ రైట్స్ లో సంచలనం పవన్ కళ్యాణ్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్ర శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోవడానికి మూడు చానళ్ళు పోటీ పడ్డాయి అయితే అందులో జెమిని టివి అత్యధిక రేటు ఇచ్చి పవన్ కళ్యాణ్ చిత్రాన్ని సొంతం చేసుకుంది దాంతో ఇప్పుడు ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది . ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ అజ్ఞాత వాసి అనే టైటిల్ అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు . ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులకు రేటు ఎంత పలికిందో తెలుసా ....... 19 కోట్ల యాభై లక్షలు .        స్టార్ మాటివి 14 లేదా 15 కోట్ల కు తీసుకోవడానికి ముందుకు వచ్చింది అయితే నిర్మాత దానికి ఒప్పుకోలేదు , ఇక జీ తెలుగు ఛానల్ వాళ్ళు 16 కోట్ల వరకు రేటు పలికారట ! దానికి కూడా అతడు ఒప్పుకోలేదు దాంతో రంగంలోకి దిగిన జెమిని టివి ఫైనల్ గా 19 . 50 కోట్లకు శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది . పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యుయేల్ నటించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు . ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది  జనవరి 10న రిలీజ్ కానుంది . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..