బిచ్చగాడు హీరో మళ్లీ హిట్ కొట్టేలాగే ఉన్నాడు
TOLLYWOOD
 TOPSTORY

బిచ్చగాడు హీరో మళ్లీ హిట్ కొట్టేలాగే ఉన్నాడు

Murali R | Published:October 12, 2017, 9:16 PM IST
బిచ్చగాడు చిత్రంతో తెలుగునాట సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోనీ తాజాగా ఇంద్రసేన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ , హీరోయిన్ లు మహిమ, డయానా చంపిక , దర్శకుడు శ్రీనివాసన్ లతో పాటు మాటల , పాటల రచయిత భాషశ్రీ కూడా పాల్గొన్నారు. ట్రయిలర్ ని సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఆవిష్కరించారు.

రాధిక శరత్ కుమార్ , విజయ్ ఆంటోనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న తెలుగు , తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంతో విజయ్ ఆంటోనీ సక్సెస్ కొట్టేలాగే ఉన్నాడు. బిచ్చగాడు చిత్రం తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన చిత్రాలు ఆ రేంజ్ లో హిట్ కాలేదు కానీ ఈ ఇంద్రసేన మాత్రం హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే.Comments

FOLLOW
 TOLLYWOOD