ఈ 27న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు
TOLLYWOOD
 TOPSTORY

ఈ 27న ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు

Murali R | Published:October 16, 2017, 5:04 PM IST

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్ లో శివ సాయి సమర్పణలో నిర్మాత ప్రశ్నాద్  తాతా నిర్మిస్తున్న చిత్రం ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు. మహీదర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణకార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధంగా  ఉండటం తో మీడియా సమావేశాన్ని  సోమవారం ఉదయం సారథి స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నిర్మాత ప్రశ్నాద్ తాతా  మాట్లాడుతూ ఇదే సారథి స్టూడియోలో స్టూడెంట్స్ గా ఉన్నామేము నేడు స్టేజి ఎక్కి సినిమా గురుంచి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటారో అదే ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. ఈ చిత్రానికి గానూ కొత్త విలన్ ను పరిచయం చేయడం జరుగుతోంది. ఇప్పుడు వస్తున్న వెజిటేరియన్ సినిమాల మధ్యలో మా సినిమా ఒక వెజిటేరియన్ గా వస్తోంది అని చెప్పగలను. కథ  కథనాలకు  ప్రాధాన్యత ఉన్న   మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నా.  అలానే ఈ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా  కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అన్నారు.   దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ ఈ చిత్రం కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.  వైజాగ్, నెల్లూరు తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాము.  మాకు సహాయసహకారాలు అందించిన రాదా కృష్ణ గారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నా అన్నారు.  ఈ చిత్రం లో మెయిన్ రోల్ లో చేస్తున్నాను. టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో చిత్ర కథాంశం కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది, అన్ని పాత్రలకు సమానమైన  ఇంపార్టెంట్స్ ఉంటుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నటించే  అవకాశం వచ్చింనందుకు సంతోషంగా ఫీల్ అవుతున్న అదేవిదంగా  ఈ సినిమాలో నటించిన   మరో హీరో ప్రశాంత్ ఇటీవలే మరణించడం  బాధాకరమైన విషయం అని తెలిపారు హీరో  మహీధర్.  అనంతరం హీరోయిన్ ఇషిత మాట్లాడుతూ కొత్త వారు అందులోనూ భాష సమస్య  ఉంటుందనే అపోహ అందరిలోనూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏమాత్రం చూపించకుండా నన్ను  సపోర్ట్ చేసిన  దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలని తెలియచేసారు. డాన్స్ మాస్ట్సర్ జోజో మాట్లాడుతూ యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాంగ్స్ చాలా బాగొచ్చాయి. మంచి మెసేజ్ కూడా ఈచిత్రంలో ఉంది.  మొదట్లో భయపడ్డాను కొత్తవారితో ఎలా డాన్స్ చేయించాలా అని ఆ తరువాత అందరూ బాగా సపోర్ట్ చేయడం తో కొరియోగ్రఫీ చేయడం సులువుగా అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు.   నటుడు బాబు మాట్లాడుతూ టైటిల్ ఎంత డిఫరెంట్  గా ఉంటుందో  సినిమా కూడా అంతే డిఫరెంట్ గా ఉండి  అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.
Comments

FOLLOW
 TOLLYWOOD