సక్సెస్ కోసం ఆరాటపడుతున్న హీరో కూతురు
TOLLYWOOD
 TOPSTORY

సక్సెస్ కోసం ఆరాటపడుతున్న హీరో కూతురు

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు , తమిళ హీరోగా సత్తా చాటాడు . అయితే అతడి కూతురు ఐశ్వర్యా అర్జున్ మాత్రం సక్సెస్ కోసం ఆరాటపడుతోంది . విశాల్ హీరోగా నటించిన '' పట్టత్తుయానై '' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఐశ్వర్యా అర్జున్ . కానీ ఆ సినిమా ప్లాప్ కావడంతో పాపం ఈ భామని హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు . మంచి అందగత్తె కానీ ఇక్కడ కావాల్సింది సక్సెస్ కాబట్టి ఐశ్వర్య ని ఎవరూ పట్టించు కోలేదు దాంతో అర్జున్ రంగంలోకి దిగాడు.

తన నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ ఓ సినిమా స్టార్ట్ చేసాడు కూతురు ని హీరోయిన్ గా నిలబెట్టడానికి , కానీ ఆ సినిమా ఎంతకూ ముందుకు కదలదే ...... రకరకాల కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది . రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న '' సొల్లి విడవా '' చిత్రంతో ఐశ్వర్యా అర్జున్ సక్సెస్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాడు అర్జున్ . మరి సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD