తప్పంతా పవన్ కళ్యాణ్ మీద నెట్టేశాడు
TOLLYWOOD
 TOPSTORY

తప్పంతా పవన్ కళ్యాణ్ మీద నెట్టేశాడు

Murali R | Published:October 26, 2017, 9:37 AM IST
తీన్ మార్ చిత్రం రీమేక్ అని అది ప్లాప్ అవుతుందని నాకు ముందుగానే తెలుసనీ కానీ చేసేది ఏమిలేక ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని అలాగే కథ, కథనం లో ఎక్కడా మార్పులు చేయకపోవడం కూడా ప్లాప్ కావడానికి కారణం అంటూ చెప్పి బాంబ్ పేల్చాడు దర్శకులు జయంత్ సి పరాంజీ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం '' తీన్ మార్ ''.  ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది , అయితే ఇప్పుడు తీన్ మార్ విషయాన్ని గురించి చెబుతూ నా చేతుల్లో ఉంటే తప్పకుండా స్క్రిప్ట్ మార్చేవాడిని దాంతో హిట్ అయ్యేది కానీ పవన్ కళ్యాణ్ యాజిటీజ్ గా తీయమన్నాడు కాబట్టి ప్లాప్ అయ్యింది సో బాధ్యత అంతా పవన్ కళ్యాణ్ దే అన్నట్లుగా చెబుతున్నాడు . 
 
 
ఇంకేముంది పవన్ కళ్యాణ్ పైన తప్పంతా నెట్టేయడం తో పవన్ ఫ్యాన్స్ జయంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . డైరెక్టర్ జయంత్ పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు అలాగే డిజాస్టర్ లకు కూడా . ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా జయదేవ్ అనే సినిమా చేసారు . అసలు ఆ సినిమా రిలీజ్ రోజే పీకేసారంటే అర్ధం చేసుకోవచ్చు ఎంత చెత్తో . Comments

FOLLOW
 TOLLYWOOD