జనతా గ్యారేజ్ తో మరో రికార్డ్ కొట్టేసిన ఎన్టీఆర్
TOLLYWOOD
 TOPSTORY

జనతా గ్యారేజ్ తో మరో రికార్డ్ కొట్టేసిన ఎన్టీఆర్

Murali R | Published:January 12, 2017, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటించిన జనతా గ్యారేజ్ గత ఏడాది రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే . అయితే తాజాగా జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ మరో రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు . ఇంతకీ ఎన్టీఆర్ అందుకున్న సరికొత్త రికార్డ్ ఏంటో తెలుసా ........ 2016 సంవత్సరంలో టివి లో అత్యధిక ప్రేక్షకులు చూసిన సినిమా ఏదో తెలుసా ......... ఇంకేదీ జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం 2016 నెంబర్ వన్ గా నిలిచింది.

ఈ విషయాన్నీ టివి ఆడియన్స్ మానిటరింగ్ ఏజెన్సీ ( బి ఏ ఆర్ సి ) ప్రకటించింది . ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యా మీనన్ లు నటించగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది . జనతా గ్యారేజ్ తో నెంబర్ వన్ హిట్ ని అందుకున్న ఎన్టీఆర్ బుల్లితెర పై కూడా సత్తా చాటాడు . ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్ .Comments

FOLLOW
 TOLLYWOOD