జవాన్ రీ షూట్ జరుగుతోంది నిజమే
TOLLYWOOD
 TOPSTORY

జవాన్ రీ షూట్ జరుగుతోంది నిజమే

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నటించిన జవాన్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్దమైంది అయితే ఆ చిత్ర సమర్పకుడు జవాన్ రష్ చూసి కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేయాల్సిందే అని చెప్పాడట ! అయితే అదంతా వట్టి రూమరే అని అన్నారు కట్ చేస్తే తాజాగా జవాన్ చిత్ర షూటింగ్ జరుగుతోంది కాకపోతే ప్యాచ్ వర్క్ అని అంటున్నారు . నిన్నటికి నిన్న హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో రీ షూట్ జరిగింది .
 
 

సాయి ధరం తేజ్ నటించిన మూడు చిత్రాలు తిక్క , విన్నర్ , నక్షత్రం  వరుసగా డిజాస్టర్ లు అయ్యాయి . దాంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నారు . అయితే రీ షూట్ తప్పు కానేకాదు ఎందుకంటే ఏదైనా సన్నివేశం సరిగ్గా రాలేదని అనుకుంటే , సంతృప్తి కలగకపోతే దాన్ని సరి చేసుకోవడం తప్పు కానేకాదు . గతంలో ఇలాగే పలు చిత్రాలు రీ షూట్ చేసుకొని సక్సెస్ అయినవి కోకొల్లలు . జవాన్ హిట్ అయి మెగా మేనల్లుడి కి సక్సెస్ రావాలని ఆశిద్దాం .
Comments

FOLLOW
 TOLLYWOOD