40 కోట్ల సినిమా కానీ వచ్చింది 9 కోట్లే
TOLLYWOOD
 TOPSTORY

40 కోట్ల సినిమా కానీ వచ్చింది 9 కోట్లే

Murali R | Published:August 15, 2017, 12:00 AM IST
జయ జానకి నాయక సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి 40 కోట్ల కు పైగా ఖర్చు పెట్టి నిర్మించాడు . అయితే ఈనెల 11న రిలీజ్ అయిన జయ జానకి నాయక తొలి వీకెండ్ లో కేవలం 9 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది అది కూడా వరల్డ్ వైడ్ షేర్ , అంటే 31 కోట్ల కు పైగా వసూల్ చేయాలి ఈ సినిమా , ఫస్ట్ వీక్ లోనే రాబట్టలేక పోయిందంటే మిగతా రోజులలో అంత భారీ మొత్తాన్ని వసూల్ చేయడం కష్టమే !

అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే ...... సాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో 11 కోట్ల పైనే వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ లో సగం వస్తున్నట్లే ! మరి మిగతా సగం మాట ఏంటో ? ఇక ఏరియాల వారీగా చూస్తే ఈ సినిమాని కొనుక్కున్న వాళ్ళు దాదాపుగా నష్టపోతున్నారు . వాళ్లకు మళ్ళీ తదుపరి సినిమాతో సర్దుబాటు చేయాల్సిందే సదరు దర్శక నిర్మాతలు.Comments

FOLLOW
 TOLLYWOOD