వంద కోట్ల పై కన్నేసిన ఎన్టీఆర్
TOLLYWOOD
 TOPSTORY

వంద కోట్ల పై కన్నేసిన ఎన్టీఆర్

Murali R | Published:August 10, 2016, 12:00 AM IST
ఎన్టీఆర్ కు అందని ద్రాక్ష అయిన 50 కోట్ల మార్క్ ని నాన్నకు ప్రేమతో చిత్రంతో అందుకున్నాడు , ఇక దాని తర్వాత టార్గెట్ వంద కోట్లు . ఎన్టీఆర్ ప్రస్తుతం వంద కోట్ల మార్కెట్ పై కన్నేశాడు . ఎన్టీఆర్ ఆలోచనకు తగ్గట్లుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు వరుస విజయాలు సాధిస్తున్న దర్శకులు కొరటాల శివ కూడా తోడవడంతో ''జనతా గ్యారేజ్ '' చిత్రంతో  అవలీలగా వంద కోట్ల క్లబ్ లో చేరుతానని నమ్మకంగా ఉన్నాడు ఎన్టీఆర్ . 
n
 
n
శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిసుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . ఒక్క తెలుగు నాట మాత్రమే కాకుండా తమిళ , మలయాళ భాషలలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆగస్టు 12న భారీ ఎత్తున రిలీజ్ కానున్న జనతా గ్యారేజ్ తో వంద కోట్లు కొల్లగొట్టి సత్తా చాటడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు ఎన్టీఆర్ . Comments

FOLLOW
 TOLLYWOOD