మనం సైతం తో మమేకమైన కాదంబరి
TOLLYWOOD
 TOPSTORY

మనం సైతం తో మమేకమైన కాదంబరి

Murali R | Published:November 12, 2017, 8:31 PM IST
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్ మనం సైతం అనే స్వచ్ఛంద సంస్థ ని నెలకొల్పి మిత్రుల సహకారంతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ సినిమా రంగంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు . కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు పలువురు సినీ ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు కూడా . దర్శకులు కొరటాల శివ కూడా కాదంబరి లోని సేవాతత్పరత ని కొనియాడుతూ అండగా నిలిచాడు . ఆపదలో ఉన్న సినీ కార్మికుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ అందరిచేత కొనియాడ బడుతున్నాడు.

తాజాగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మురళీకృష్ణ హార్ట్ ఆపరేషన్ కోసం 50, 000/ -ల ఆర్ధిక సహాయం మిత్రులందరి సహకారంతో అందించాడు కాదంబరి . పలు సినిమాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరించిన మురళీకృష్ణ కు 3 లక్షల ఖర్చు అయ్యింది హార్ట్ ఆపరేషన్ కు దాంతో తనవంతు బాధ్యతగా భావించిన కాదంబరి మనం సైతం అనే వాట్సాప్ గ్రూప్ ని పెట్టి మిత్రులను సహాయం చేసే దిశగా పయనించేలా చేసి యాభై వేల ని పోగు చేసి ఆ కుటుంబానికి ఇచ్చాడు.Comments

FOLLOW
 TOLLYWOOD