కళ్యాణ్ రామ్ కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
TOLLYWOOD
 TOPSTORY

కళ్యాణ్ రామ్ కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

Murali R | Published:September 25, 2016, 12:00 AM IST

అన్న కళ్యాణ్ రామ్ కు తమ్ముడు ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడు . ఇంతకీ ఆ షాక్ ఏంటో తెలుసా ................ ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఇజం చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే , అయితే ఆ చిత్రాన్ని మరింత హైప్ క్రియేట్ చేయడానికి ఎన్టీఆర్ చేత ఓ చిన్న పాత్ర చేయించాలని అనుకున్నాడట కళ్యాణ్ రామ్ పైగా తమ్ముడు కాబట్టి అడిగితే కాదనడు అన్న భరోసాతో తమ్ముడు ఇజం లో నువ్వో స్పెషల్ రోల్ చేస్తే బాగుటుంది అని చెప్పాడట అది విన్న వెంటనే ఎన్టీఆర్ నిర్మొహమాటం లేకుండా వద్దన్నయ్యా ! అలా చేస్తే నాకు ఇబ్బంది పైగా సినిమాకు ఎలాంటి ఉపయోగం ఉండదు కావాలంటే ఇద్దరం కలిసి మరో సినిమా చేద్దాం ఎందుకంటే మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నామంటే తప్పకుండా అంచనాలు భారీ గా ఉంటాయి కాబట్టి ఈ సినిమా వద్దు అని చెప్పేశాడట . ఎన్టీఆర్ నుండి అలాంటి మాటలు రావడంతో మొదట షాక్ అయ్యాడట నందమూరి కళ్యాణ్ రామ్ . అయితే ఆ తర్వాత తమ్ముడి మాటలు నిజమే కదా ! అని రియలైజ్ అయ్యాడట కళ్యాణ్ రామ్.
Comments

FOLLOW
 TOLLYWOOD