43 ఏళ్ల భామ రెండో పెళ్ళికి రెడీ అవుతోంది
TOLLYWOOD
 TOPSTORY

43 ఏళ్ల భామ రెండో పెళ్ళికి రెడీ అవుతోంది

Murali R | Published:November 16, 2017, 5:24 PM IST
కరిష్మా కపూర్ 43 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతోంది . ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఈభామ సంజయ్ కపూర్ కు గత ఏడాది విడాకులు ఇచ్చింది . ఇద్దరు పిల్లలు కూడా ఉన్న కరిష్మా గతకొంత కాలంగా భర్త కు దూరంగానే ఉంటోంది . అయితే గత ఏడాది మాత్రం విడాకులు మంజూరు కావడంతో ఇప్పుడు తన ప్రియుడ్ని రెండో పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది . తాజాగా తన ప్రియుడు సందీప్ తోష్నివాల్ తోకరిష్మా  కలిసి బంగారు ఆభరణాలు కొనడంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

కరిష్మా - సందీప్ తోష్నివాల్ ల పెళ్లి గురించి కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ ని అడిగితే కరిష్మా మళ్ళీ పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని సంతోషమయం చేసుకుంటే అంతకుమించిన సంతోషం ఏముంది నాకు , అందరి కంటే ఎక్కువ సంతోషించే వాడ్ని నేనే ఆ శుభ ఘడియల కోసమే నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . అంటే కరిష్మా తండ్రి చేబుతున్న దాని ప్రకారం ఆమె పెళ్లి ఖాయమై పోయింది , అయితే కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరుగనుందట.Comments

FOLLOW
 TOLLYWOOD