హిట్ కొట్టిన కార్తీ ఖాకీ
TOLLYWOOD
 TOPSTORY

హిట్ కొట్టిన కార్తీ ఖాకీ

Murali R | Published:November 17, 2017, 12:39 PM IST
తమిళ స్టార్ హీరో కార్తీ హిట్ కోసం చాలారోజులుగానే ఎదురు చూస్తున్నాడు ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన చెలియా ఘోర పరాజయం తర్వాత చేసిన సినిమా ఖాకీ . ఈరోజు రిలీజ్ అయిన ఖాకీ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది . ఇక ఓవర్ సీస్ లో ముందుగానే రిలీజ్ కావడంతో అక్కడ ప్రీమియర్ షోలు పడ్డాయి , ఆ షోల టాక్ ఎలా ఉందో తెలుసా ........ ....... ఖాకీ హిట్ అని , కార్తీ ఖాకీ చిత్రంతో సూపర్ హిట్ కొట్టేశాడని అంటున్నారు . పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు ....... రకుల్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అయ్యింది .
 
 
అయితే పవర్ ఫుల్ పోలీస్ అనగానే సినిమా పోలీస్ లా కాకుండా రియలిస్టిక్ అప్రోచ్ తో ఈ సినిమా సాగడం విశేషం . దొంగల ముఠా ని పట్టుకునే కోణంలో సాగే డ్రామా ఈ ఖాకీ . మొత్తానికి కార్తీ కి ఈ ఖాకీ హిట్ ని తెచ్చివ్వడమే కాకుండా నటుడిగా మరో మెట్టు ఎక్కించింది కూడా . కార్తీ గెటప్ , యాక్షన్ ప్రేక్షకులను అలరించేలా ఉంది అలాగే రకుల్ నటన కూడా బాగుంది . ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మరింతగా బాగుండటంతో ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన సినిమా గా తెరకెక్కింది ఈ ఖాకీ .Comments

FOLLOW
 TOLLYWOOD