కార్తికేయ సీక్వెల్ వచ్చే ఏడాది
TOLLYWOOD
 TOPSTORY

కార్తికేయ సీక్వెల్ వచ్చే ఏడాది

Murali R | Published:October 25, 2017, 7:25 PM IST
మూడేళ్ళ క్రితం వచ్చిన కార్తికేయ సంచలన విజయం సాధించింది దాంతో అప్పుడే ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనీ ప్లాన్ చేసారు కానీ ఒకవైపు నిఖిల్ మరోవైపు చందు మొండేటి కూడా బిజీ గా ఉండటం వల్ల సీక్వెల్ కుదరలేదు కానీ ఇన్నాళ్లకు దానికి శ్రీకారం చుట్టారు , వచ్చే ఏడాది లో ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది ఇదే విషయాన్నీ నిఖిల్ ట్వీట్ చేసాడు . ఆసక్తికరమైన కథ , కథనాలతో కార్తికేయ రూపొందగా సీక్వెల్ కథ , కథనం కూడా అలాగే రూపొందిందట . ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ అయ్యిందని తెలిపాడు నిఖిల్.

ప్రస్తుతం నిఖిల్ కన్నడంలో హిట్ అయిన కిరాక్ పార్టీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు , ఇక చందు మొండేటి కూడా నాగచైతన్య తో సవ్యసాచి అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . ఆ రెండు కంప్లీట్ అయితే ఇద్దరు కూడా ఫ్రీ అవుతారు , అప్పుడు సీక్వెల్ పై దృష్టి పెడతారు నిఖిల్ - చందు మొండేటి . విభిన్న తరహా కథా చిత్రాలను ఎంచుకుంటున్న నిఖిల్ మంచి విజయాలను సాధిస్తున్నాడు.Comments

FOLLOW
 TOLLYWOOD