కాటమ రాయుడు కథ ఇదే
TOLLYWOOD
 TOPSTORY

కాటమ రాయుడు కథ ఇదే

Murali R | Published:March 19, 2017, 12:00 AM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా కాటమ రాయుడు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . డాలి దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిన ఈ చిత్ర కథ ఏంటో పవన్ రివీల్ చేసాడు . నలుగురు తమ్ముళ్ళు అయిన శివబాలాజీ , చైతన్య కృష్ణ , కమల్ కామరాజ్ , అజయ్ లకు అన్న ఈ కాటమ రాయుడు పవన్ కళ్యాణ్ . అతడు పెళ్లి చేసుకోకుండా తమ్ముళ్ళ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తీ కావడం, తమ్ముళ్ళు మాత్రం ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెంట పడటంతో అన్నయ్య కు పెళ్లి కాకుండా ఎలా అందుకే అన్నయ్య కు కూడా ఓమంచి అమ్మాయిని చూసి ప్రేమలో పడేలా చేస్తారు . 
 
 

అన్నయ్య పెళ్లి చేసుకుంటే మా లైన్ క్లియర్ అవుతుందని ప్లాన్ వేస్తారు ? చివరకు అన్నయ్య ప్రేమలో పడ్డాడా ? తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయా ? అన్నదే కాటమ రాయుడు చిత్ర కథ . అయితే మద్యలో విలన్లు పోరాటాలు కామన్ పాయింట్ అన్నమాట . మొత్తానికి పవన్ కళ్యాణ్ కథ లీక్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD