ఖైదీ నెంబర్ 150 రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

ఖైదీ నెంబర్ 150 రివ్యూ రేటింగ్ ఎంతో తెలుసా

Murali R | Published:January 11, 2017, 12:00 AM IST
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత  నటించిన చిత్రం '' ఖైదీ నెంబర్ 150''. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యూకే అండ్ యు ఏ ఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఫిలిం క్రిటిక్ కూడా అయిన ఉమైర్ సందు ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూసి తన రివ్యూ ని ఇచ్చేసారు . ఖైదీ నెంబర్ 150 చిత్రానికి రేటింగ్ ఎంత ఇచ్చారో తెలుసా ........ 4 / 5 . భారీ ఎత్తున రేటింగ్ ఇవ్వడమే కాకుండా సినిమా మైండ్ బ్లోయింగ్ అని పైసా వసూల్ చిత్రమని పొగడ్తలతో ముంచెత్తారు .

ప్రొడక్షన్ వాల్యూస్ , దేవిశ్రీ ప్రసాద్ పాటలు యూత్ ని ఫాన్స్ ని హుషారు ఎత్తించేలా ఉందని  , రీ రికార్డింగ్ సినిమాకు ప్రాణం లా నిలిచిందని ...... చిరు డైలాగ్స్ కి థియేటర్ లు దద్దరిల్లడం ఖాయమని చిరు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా షాక్ అని పదేళ్ల వయసు తక్కువ ఉన్నవాడిలా ఉన్నాడని ..... వినాయక్ దర్శకత్వ ప్రతిభ కాజల్ గ్లామర్ వెరసి ఖైదీ నెంబర్ 150 చిత్రం సంక్రాంతి కి ఫుల్ మీల్స్ అంటూ రివ్యూ ఇచ్చేస్తున్నారు . ఓవరాల్ గా చిరంజీవి 150 వ చిత్రం బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు . ఇక అసలు రివ్యూ ఏంటో రేపు ప్రేక్షకులు తీర్పు ఇవ్వనున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD