విజయ్ దేవరకొండ ని రిజెక్ట్ చేసిన భామ
TOLLYWOOD
 TOPSTORY

విజయ్ దేవరకొండ ని రిజెక్ట్ చేసిన భామ

Murali R | Published:September 6, 2017, 12:00 AM IST

అర్జున్ రెడ్డి తో సంచలన విజయం అందుకొని అందరి దృష్టి ఆకర్షిస్తున్న హీరో విజయ్ దేవరకొండ . అయితే అతడి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ముందుగా ఒప్పుకొని ఇప్పుడేమో ఆ సినిమా నుండి బయటకు వచ్చేసింది హీరోయిన్ '' లావణ్య త్రిపాఠి ''. ప్రస్తుతం ఈ భామ నటించిన యుద్ధం శరణం రిలీజ్ కి సిద్ధంగా ఉంది . అలాగే హీరో రామ్ సరసన ''ఉన్నది ఒకటే జిందగీ '' చిత్రంలో నటిస్తోంది . రామ్ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ సరసన నటించడానికి ఒప్పుకుంది . అయితే తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం లావణ్య విజయ్ దేవరకొండ సినిమాని రిజెక్ట్ చేసింది .

 

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు , హీరో విజయ్ దేవరకొండ పెద్ద బ్యానర్ గీతా ఆర్ట్స్ . పైగా ఆ బ్యానర్ లో ఇంతకుముందు అల్లు శిరీష్ సరసన '' శ్రీరస్తు శుభమస్తు '' అనే సినిమాలో నటించి మంచి హిట్ కూడా అందుకుంది లావణ్య త్రిపాఠి . అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ కూడా పెరిగింది కానీ లావణ్య మాత్రం ఆ సినిమా నుండి తప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది . కథ , పాత్ర ల విషయంలో ఎక్కడో లావణ్య హర్ట్ అయ్యిందట దాంతో సినిమా నుండి బయటకు వచ్చిందని అంటున్నారు .
Comments

FOLLOW
 TOLLYWOOD