కష్టాల్లో లావణ్య త్రిపాఠి
TOLLYWOOD
 TOPSTORY

కష్టాల్లో లావణ్య త్రిపాఠి

Murali R | Published:September 29, 2017, 3:38 AM IST
అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కి కొత్తగా కష్టాలు వచ్చి పడ్డాయి. తమిళ దర్శక నిర్మాతలు లావణ్య పై చర్యలు తీసుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఇంతకీ లావణ్య త్రిపాఠి చేసిన తప్పు ఏంటో తెలుసా ........ 100% లవ్ సినిమాలో నటిస్తానని ఒప్పుకొని షూటింగ్ కి డుమ్మా కొట్టడమే.

తెలుగులో సూపర్ హిట్ అయిన 100 % లవ్ చిత్రాన్ని దర్శకుడు చంద్రమౌళి తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఆ చిత్రంలో లావణ్య త్రిపాఠి తమన్నా పోషించిన పాత్రని పోషిస్తోంది. కొద్ది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంది కూడా . కానీ ఫారిన్ షెడ్యూల్ కు మాత్రం వెళ్లకుండా దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టిందట దాంతో లావణ్య త్రిపాఠి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆమెకు గట్టి గుణపాఠం చెప్పాలని కోపంతో రగిలిపోతున్నారు. పాపం లావణ్య కు ఈ కష్టాలు ఏంటో . ఇటీవలే విజయ్ దేవరకొండ సినిమా నుండి తప్పుకుంది ,ఇకఇప్పుడేమో తమిళ సినిమా గొడవ . ఎప్పుడు ఆ కష్టాల్లోంచి బయటపడుతుందో చూడాలి. Comments

FOLLOW
 TOLLYWOOD