తమిళ్ లో హిట్ మరి ఇక్కడ
TOLLYWOOD
 TOPSTORY

తమిళ్ లో హిట్ మరి ఇక్కడ

Murali R | Published:October 25, 2017, 5:21 PM IST
నవంబర్ 10న లండన్ బాబులు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు , కలర్స్ స్వాతి - రక్షిత్ జంటగా నటించారు అయితే ఇటీవలే మహానుభావుడు చిత్రంతో సక్సెస్ అందుకున్న మారుతి ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడంతో లండన్ బాబులు చిత్రంపై ఆశలు ఉన్నాయి పైగా తమిళం లో హిట్ అయింది దాంతో తెలుగులో రీమేక్ చేసారు . అక్కడ హిట్ అయ్యింది కాబట్టి పైగా బర్ణింగ్ ఇస్స్యూ కాబట్టి తప్పకుండా యూత్ ని ఆకట్టుకునే సినిమా ....... ఆలోచింప జేసే సినిమా అని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం.

ఈరోజుల్లో ఉన్న యువత ప్రేమించుకోవడానికి ఎంతగా తొందర పడుతున్నారు అలాగే పెళ్లి చేసుకోవడానికి ఎంతగా తొందర పడుతున్నారు దాని పర్యవసానాలు ఏంటి ? ఎంత తొందరగా విడిపోతున్నారు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది లండన్ బాబులు . ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉద ఇదే కాబట్టి తప్పకుండా హిట్ అవుతుందని ఆశపడుతున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD