కాజల్ కు షాక్ ఇచ్చిన కోర్టు
TOLLYWOOD
 TOPSTORY

కాజల్ కు షాక్ ఇచ్చిన కోర్టు

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
కాజల్ అగర్వాల్ కు మద్రాస్ హై కోర్టు షాక్ ఇచ్చింది . కాజల్ కెరీర్ తొలినాళ్ళ లో తమిళనాట వీవీడి కొబ్బరినూనె ప్రచార గీతంలో నటించింది కాజల్ . అయితే సంవత్సరం పూర్తి అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆ సంస్థ నిర్వాహకులు ఆ యాడ్ ని ఇంకా వాడుకుంటున్నారు దాంతో సంవత్సరం వరకు మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నామని కాబట్టి ఆ యాడ్ ని ఆపేయాలని లేదంటే నాకు నష్టపరిహారంగా రెండున్నర కోట్ల ని చెల్లించాలని కోర్టు కెక్కింది .
 

2011 లో కాజల్ అగర్వాల్ కోర్టుకెక్కగా తాజాగా కోర్టు తీర్పు నిస్తూ కాజల్ కు షాక్ ఇచ్చింది . యాడ్ అనేది ఆ సంస్థ కి చెందినది అలాగే కాపీ రైట్స్ చట్టం ప్రకారం 60 సంవత్సరాల వరకు ఆ హక్కులు ఉంటాయి ,కాబట్టి అభ్యంతరం చెప్పడానికి కాజల్ కు హక్కు లేదని కాజల్ కేసు ని కొట్టేసింది మద్రాస్ హై కోర్టు . దాంతో ఖంగుతినడం కాజల్ అగర్వాల్ వంతు అయ్యింది . 
Comments

FOLLOW
 TOLLYWOOD