సెప్టెంబర్ 7న 'మ‌హ‌నుభావుడు' టైటిల్ సాంగ్ విడుదల
TOLLYWOOD
 TOPSTORY

సెప్టెంబర్ 7న 'మ‌హ‌నుభావుడు' టైటిల్ సాంగ్ విడుదల

Murali R | Published:September 5, 2017, 12:00 AM IST
శ‌ర్వానంద్ హీరోగా,  మెహ్రీన్ హీరోయిన్ గా,  మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు చిత్ర షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది.  ఇదిలా ఉంటే... మహానుభావుడు టైటిల్ సింగిల్ ను సెప్టెబర్ 7న ఉదయం 8.45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. కాగా... త్వ‌ర‌లోనే మహానుభావుడు ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మి కి చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతమందించాడు. ఈ చిత్రం మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా  వుంటుంది.

న‌టీన‌టులు.. శ‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, భ‌ద్రం, క‌ళ్యాణి న‌ట‌రాజ్‌, పిజ్జాబాయ్‌, భాను, హిమ‌జ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, మ‌ధుమ‌ణి, రాగిణి, ర‌జిత‌, అబ్బులు చౌద‌రి, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు.

Related Links

Sharwanand Mahanubhavudu gets release Date
huge profits for sharwanand mahanubhavudu
Sharwanand Mahanubhavudu gets release DateComments

FOLLOW
 TOLLYWOOD