కిస్ మి బేబీ అంటున్న మహానుభావుడు
TOLLYWOOD
 TOPSTORY

కిస్ మి బేబీ అంటున్న మహానుభావుడు

Murali R | Published:September 13, 2017, 12:00 AM IST
శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం '' మహానుభావుడు ''. ఇంతకుముందు శర్వానంద్ - యువి క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన '' రన్ రాజా రన్ '' , '' ఎక్స్ ప్రెస్ రాజా '' చిత్రాలు సూపర్ హిట్ కావడం అగ్ర హీరోల చిత్రాలతో పోటీపడి హిట్స్ కావడం తో తాజాగా మహానుభావుడు చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ , మహేష్ చిత్రాలకు పోటీగా రిలీజ్ చేస్తున్నారు . ఆ విషయాన్నీ పక్కన పెడితే తాజాగా '' కిస్ మి బేబీ '' అంటూ సాగే పాట కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొడుతోంది.

కృష్ణకాంత్ కిస్ మి బేబీ అన్న పాట రాయగా తమన్ -మనీషా ఈ గీతాన్నిఆలపించారు .ఇక ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నాడన్న   విషయం అందరికీ తెలిసిందే . తమన్ అందించిన సంగీతానికి తోడూ తమన్ ఎంచుకున్న రాగం కూడా విభిన్నంగా ఉండటంతో కుర్రకారు కి బాగా నచ్చుతోంది . పైగా శర్వానంద్ సినిమా కావడంతో ఈ పాటకి మరింత క్రేజ్ వచ్చింది . ఈనెల 29న మహానుభావుడు రిలీజ్ అవుతోంది.Comments

FOLLOW
 TOLLYWOOD