మహేష్ , చరణ్ లు నో చెప్పింది ఈ సినిమాకే
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ , చరణ్ లు నో చెప్పింది ఈ సినిమాకే

Murali R | Published:August 6, 2017, 12:00 AM IST
సంచలన విజయం సాధిస్తున్న ఫిదా సినిమాని మొదట మహేష్ తో చేయాలనుకున్నాడట శేఖర్ కమ్ముల , అయితే ఫిదా కథ విన్నాక ఇది నాకు సరిపోయే కథ కాదు అంటూ డైరెక్ట్ గానే చెప్పాడట మహేష్ దాంతో ఆ కథ ని తీసుకొని చరణ్ వద్దకు వెళ్ళాడు . చరణ్ కూడా కథ అంతా విన్నాక ఈ కథ నా కంటే వరుణ్ కి అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చాడట దాంతో వరుణ్ తేజ్ ని ఆ అదృష్టం వరించింది .
 
 

హిట్ అన్న మాట వినడానికి చాలాసమయం పట్టింది వరుణ్ తేజ్ కు ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసినప్పటికీ మూడు డిజాస్టర్ లు కాగా కంచె చిత్రం మాత్రం ఫరవాలేదని పించుకుంది అంతేకాని కమర్షియల్ హిట్ కాదు . ఇప్పుడు ఫిదా తో కమర్షియల్ హిట్ అంటే ఏమిటో రుచి చూస్తున్నాడు వరుణ్ . ఇక మహేష్ , చరణ్ లు రిజెక్ట్ చేసి మంచి పనే చేశారు ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ కి తప్పకుండా ఇబ్బంది పడేవాళ్ళు . 
Comments

FOLLOW
 TOLLYWOOD