మహేష్ కొత్త సినిమా రేపే ప్రారంభం
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ కొత్త సినిమా రేపే ప్రారంభం

Murali R | Published:August 13, 2017, 12:00 AM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా రేపు ప్రారంభం కానుంది . ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడు . ఇక దర్శకుడు ఎవరో తెలుసా ........ ...... వంశీ పైడిపల్లి . బృందావనం , ఊపిరి వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . వంశీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ కు పిచ్చ పిచ్చగా నచ్చడంతో వెంటనే ఓకే చేసాడు .
 
 

రేపు ప్రారంభం అయినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పట్లో ఉండదు ఎందుకంటే కొరటాల శివ సినిమా పూర్తయ్యాకే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . ఇక ఓపెనింగ్ రోజున మహేష్ డుమ్మా కొట్టడం అలవాటు కాబట్టి యధా ప్రకారం రేపు ఓపెనింగ్ లో మహేష్ పాల్గొనడు . మహేష్ కొత్త సినిమా ప్రారంభం అంటే ఫ్యాన్స్ కు పిచ్చ పండగే పండగ . 
Comments

FOLLOW
 TOLLYWOOD