నాని తో సినిమా చేయనున్న మహేష్ సోదరి
TOLLYWOOD
 TOPSTORY

నాని తో సినిమా చేయనున్న మహేష్ సోదరి

Murali R | Published:December 14, 2017, 3:21 PM IST
మహేష్ బాబు సోదరి మంజుల నాని తో ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన మంజుల తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన మనసుకి నచ్చింది చిత్రానికి దర్శకత్వం వహించి బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు తెచ్చుకుంది . షో చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మంజుల నటిగా , దర్శకురాలిగా , నిర్మాతగా రాణిస్తోంది . మనసుకి నచ్చింది సినిమా రిలీజ్ కాకుండానే నాని తో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . 

 

అయితే నాని హీరోగా నటించే చిత్రానికి మంజుల దర్శకత్వం వహించకుండా ఆ బాధ్యతలను మనం వంటి క్లాసికల్ హిట్ ని అందించిన విక్రమ్ కుమార్ కు అప్పగిస్తోంది . గతంలో సోదరుడు మహేష్ తో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ని అందించింది మంజుల . అలాగే మరికొన్ని సినిమాల్లో నిర్మాణ భాగస్వామి గా ఉంది కూడా . నాని వరుసగా విజయాలు సాధిస్తుండటంతో అతడితో సినిమా చేయడానికి ముందుకు వచ్చింది మంజుల .
Comments

FOLLOW
 TOLLYWOOD