స్పెషల్ షో వేస్తున్న మహేష్
TOLLYWOOD
 TOPSTORY

స్పెషల్ షో వేస్తున్న మహేష్

Murali R | Published:September 29, 2017, 2:20 AM IST

మహేష్ బాబు నటించిన స్పైడర్ ఈనెల 27న రిలీజ్ అవుతోంది కానీ అంతకంటే 4 రోజుల  ముందుగానే స్పైడర్ షో ని స్పెషల్ గా వేస్తున్నాడు మహేష్, అయితే స్పైడర్  స్పెషల్ షో చూస్తున్న స్పెషల్ గెస్ట్ లు ఎవరో తెలుసా......... ఇంకెవరు మహేష్ కుటుంబమే .

సూపర్ స్టార్ కృష్ణ తో పాటుగా మహేష్ బావలు , సోదరీమణులు , అలాగే ఇతర కుటుంబ సభ్యులు స్పైడర్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా చూడనున్నారు. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై రిలీజ్ కి ముందే పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది. పైగా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించాడు. కాగా రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ సరసన నటించింది. 
Comments

FOLLOW
 TOLLYWOOD