రాజమౌళి తో మహేష్ సినిమా కన్ఫర్మ్ అట
TOLLYWOOD
 TOPSTORY

రాజమౌళి తో మహేష్ సినిమా కన్ఫర్మ్ అట

Murali R | Published:September 29, 2017, 4:50 AM IST

ఓటమి ఎరుగని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఏ హీరో అయినా కోరుకుంటాడు , ఇప్పుడు మహేష్ అదే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు . హీరో ని అభిమానులు ఎలా చూడాలని ఆశిస్తారో అలా చూపించే దర్శకుల్లో అగ్రగణ్యులు ఎస్ ఎస్ రాజమౌళి . దాంతో రాజమౌళి - మహేష్ ల కాంబినేషన్ లో సినిమా సెట్ చేయడానికి కొంతమంది నిర్మాతలు చేసిన ప్రయత్నం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది .

మూడు నాలుగేళ్ల క్రితమే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనుకున్నారు కానీ కుదరలేదు ఇక ఇప్పుడు సెట్ అయ్యింది కానీ సెట్స్ మీదకు వెళ్లాలంటే మాత్రం మరో ఏడాది పైనే పట్టొచ్చు . 2018 ఆఖరులో మహేష్ తో రాజమౌళి సినిమా ఉండొచ్చు . త్వరలోనే మా ఇద్దరు కాంబినేషన్ లో సినిమాఉంటుందని మహేష్ బాబు అధికారికంగా ధృవీకరించాడు . మహేష్ చెప్పాడు కాబట్టి ఫ్యాన్స్ సంతోషానికి అంతే ఉండదు ఎందుకంటే ఈ కాంబినేషన్ లో కనుక సినిమా వస్తేసరికొత్త  రికార్డులు సృష్టించడం ఖాయం .
Comments

FOLLOW
 TOLLYWOOD