మహేష్ కొత్త సినిమా జనవరిలో సెట్స్ మీదకు
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ కొత్త సినిమా జనవరిలో సెట్స్ మీదకు

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా డిసెంబర్ కల్లా పూర్తవుతుంది కాబట్టి మరో కొత్త సినిమాలో జనవరి నుండి జాయిన్ కానున్నాడు మహేష్ . ఇక ఆ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ - దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించనుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు . 
 
 

కొత్త తరహా కథా చిత్రంతో తెరకెక్కనున్న ఈ చిత్రం అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుంది . మహేష్ స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా సంక్రాంతికి భరత్ అనే నేను చిత్రం రిలీజ్ కానుంది . ఇక అప్పటి నుండి ఈ కొత్త సినిమా ప్రారంభం అవుతుంది . అంటే 2018 లో మహేష్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయన్నమాట . 
Comments

FOLLOW
 TOLLYWOOD