సోదరికి సహాయం చేస్తున్న మహేష్
TOLLYWOOD
 TOPSTORY

సోదరికి సహాయం చేస్తున్న మహేష్

Murali R | Published:August 12, 2017, 12:00 AM IST
మహేష్ బాబు తన సోదరి మంజుల కు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు . మహేష్ తన సోదరికి ఎలాంటి సహాయం అందిస్తున్నాడో తెలుసా ....... స్పైడర్ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే . మహేష్ సినిమా అంటే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాతో మంజుల దర్శకత్వం వహిస్తున్న సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మంజుల దర్శకత్వం వహిస్తూ సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తీస్తోంది . కామన్ గా ఆ సినిమా ని ప్రమోట్ చేయాలంటే చాలాఖర్చు అవుతుంది అదే మహేష్ సినిమాతో ట్రైలర్ ని థియేటర్ లో రిలీజ్ చేస్తే ఎక్కువమంది కి రీచ్ అవుతుంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు . మంజుల దర్శకురాలి గా సక్సెస్ కావాలి కాబట్టి మహేష్ ఈ రకంగా సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాడట.Comments

FOLLOW
 TOLLYWOOD